వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే. ఈరోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై శ్రీలంక గెలిస్తే పాక్ కి సెమీస్ ఆశలుండేవి. కానీ, లంకను న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో పాకిస్తాన్ జట్టు సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లయింది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో శ్రీలంక ఖాతాలో మరో ఓటమి నమోదైంది. మరోవైపు న్యూజిలాండ్ కు ఈ విజయంతో సెమీస్ అవకాశాలు మరింత బలమయ్యాయి. కాగా.. సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న పాక్ జట్టు ఆశలు గల్లంతయ్యాయి.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కివీస్ స్టార్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఫీట్ సాధించాడు. వన్డే వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రచిన్ రికార్డులకెక్కాడు.
వన్డే ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెండ్ బౌల్ట్ ఓ అరుదైన ఘనత సాధించాడు. తన జట్టు తరుఫున 50కు పైగా వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా బౌల్ట్ రికార్డ్ సృష్టించాడు. ఈరోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కుశాల్ మెండీస్ వికెట్ తీసి ఈ ఫీట్ సాధించాడు.
ప్రపంచకప్ 2023లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ అన్నింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఉంది. లీగ్ దశలో కేవలం నెదర్లాండ్స్‌తో మ్యాచ్ మిగిలి ఉంది. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో నెంబర్ 4 జట్టుతో భారత్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా గెలవడమే కాదు.. అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శనను చూపిస్తుంది. దీంతో ప్రత్యర్థి జట్లను ఓడించి ఏకపక్షంగా…
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు కివీస్ బౌలర్లకు పెరెరా చుక్కలు చూపించాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి అర్ధసెంచరీ సాధించాడు.