ఈ ప్రపంచకప్ లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లో ఓటమి ఎరుగని జట్టుగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో రేపు న్యూజిలాండ్ తో సెమీస్ లో తలపడనుంది. ఇంతకుముందు న్యూజిలాండ్-ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు టీమిండియాను కివీస్ బౌలర్లు ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరోవైపు టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్‌ను దెబ్బతీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వన్డేల్లో భారత్ కు చెందిన ఈ ఐదుగురు బౌలర్లు న్యూజిలాండ్ ను ఓ ఆట ఆడుకున్నారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం….
World Cup 2023: వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్, ఫైనల్కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయింపు
మహ్మద్ షమీ: టాప్-5లో మహ్మద్ షమీ ఉన్నారు. మహ్మద్ షమీ న్యూజిలాండ్‌తో 13 వన్డేల్లో 21.93 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచకప్ లీగ్ దశలో న్యూజిలాండ్‌పై 5 వికెట్లు తీశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై వేదికగా జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ షమీపై టీమిండియా భారీ అంచనాలు పెట్టుకుంది.
జహీర్ ఖాన్: ఈ మాజీ భారత ఫాస్ట్ బౌలర్ న్యూజిలాండ్‌తో వన్డే ఫార్మాట్‌లో 22 మ్యాచ్‌లు ఆడాడు. అతను 27.73 సగటుతో మొత్తం 30 వికెట్లు తీశాడు.
కపిల్ దేవ్: భారత మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్.. న్యూజిలాండ్‌తో వన్డే ఫార్మాట్‌లో 29 మ్యాచ్‌లు ఆడి 27.60 సగటుతో 33 వికెట్లు తీశాడు.
అనిల్ కుంబ్లే: భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌తో 31 మ్యాచ్‌లు ఆడాడు. 27.84 సగటుతో మొత్తం 39 వికెట్లు తీశాడు.
జావగల్ శ్రీనాథ్: న్యూజిలాండ్‌పై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా జవగల్ శ్రీనాథ్ ఉన్నారు. న్యూజిలాండ్‌పై 20.41 సగటుతో మొత్తం 51 వికెట్లు తీశాడు.