కార్తీక మాసం ఆరంభం.. గోదావరిలో భక్తులతో కిటకిటలాడుతోన్న స్నానఘట్టాలు
నేటి నుండి కార్తీక మాసం ఆరంభం కావడంతో రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వేలాదిగా తరలివచ్చి గోదావరిలో భక్తులు కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్య స్నానాలతో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ కిక్కిరిసాయి. స్నానాలు ఆచరించిన మహిళలు శివనామ స్మరణతో గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు.. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.. మరోవైపు.. భీమవరం పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామి దర్శనానికి బారులు తీరారు భక్తులు.. ఇక, సామర్లకోట పంచారామ క్షేత్రం కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామి దర్శనానికి క్యూ కట్టారు భక్తులు.. మరోవైపు.. ద్రాక్షరామ పంచారామ క్షేత్రం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.. ఇక, కార్తిక మాసం ప్రారంభం సదర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో దర్శనం వేళలో మార్పులు చేశారు ఆలయ అధికారులు.. ఉదయం 4 గంటలకు ఆలయం తెరిచి 5 గంటలకు భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తు్నారు.. రాత్రి 9 గంటలకు భక్తులకు దర్శనాలు నిలిపివేయనున్నారు..
నేటి నుంచి కోటి దీపోత్సవం.. తొలిరోజు జరిగే మహా ఘట్టాలు ఇవే..
కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. కార్తిక స్నానాలు, దైవ దర్శనాలు, దీపారాధనతో అన్ని పుణ్యక్షేత్రాలు భక్తులతో రద్దీగా మారుతాయి.. ఇదే సమయంలో.. అందరి చూపు ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటిదీపోత్సవంపై ఉంటుంది.. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా రచనా టెలివిజన్ ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విషయం విదితమే కాగా.. ఆ మహా దీపయజ్ఞం ఈ రోజు ప్రారంభం కానుంది.. ఏటా కార్తీక మాసంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామార్తలను దేవికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహిస్తారు.. ప్రసిద్ధ పండితుల ప్రవచనాలు అందిస్తున్నారు.. పీఠాధిపతులు అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందజేస్తారు.. అతిరథ మహారథుల అథిథులుగా విచ్చేసే ఈ దీప యజ్ఞం ఈరోజు ప్రారంభం కానుంది.. భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్ పక్షాన పూర్తి ఉచితంగా అందిస్తున్న విషయం విదితమే.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి టీవీ ఈ దీప మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తుంది.. నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటిదీపోత్సవం జరగనుంది.. పెద్ద సంఖ్యలో తరలిరావాల్సింది భక్తులకు ఆహ్వానం పలుకుతోంది భక్తి టీవీ..
ఇక, భక్తి టీవీ కోటిదీపోత్సవంలో తొలి రోజు నిర్వహించనున్న విశేష కార్యక్రమాల విషయానికి వస్తే..
* సమస్త పుణ్య నదుల జలాలతో కాశీస్పటిక లింగానికి సహస్రకలశాభిషేకం..
* భక్తులతో కోటిమల్లెల అర్చన..
* శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జునుల కల్యాణం..
* హంసవాహనంపై ఆదిదంపతుల దర్శనం
* సూత్తూరు శ్రీక్షేత్ర మఠాధిపతి శ్రీశివరాత్రిదేశికేంద్ర మహాస్వామి అనుగ్రహ భాషణం
* శ్రీబాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి ప్రవచనామృతం
* అపూర్వ సాంస్కృతిక కదంబాలు.. సప్తహారతుల కాంతులు.. కోటి దీపాల వెలుగులు.. మహాదేవునికి మహానీరాజనాలు..
నేటి నుండి శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు.. భక్తులు ఇవి గమనించాలి..
తెలుగు రాష్ట్రాల్లో కార్తిక శోభ కనిపిస్తోంది.. ఉదయం నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ.. దీపాలు వెలగిస్తూ.. దేవదేవుడికి మొక్కకుంటారు.. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనదిగా భావిస్తున్నారు. ఈ కార్తీకమాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనది. ఇక, ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఇవాళ్టి నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ఈ మాసంలో శ్రీశైలం వెళ్లే భక్తులు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.. ఎందుకంటే.. కార్తీకమాసమంతా భక్తుల రద్దీ దృష్ట్యా సామూహిక, గర్భాలయా అభిషేకాలు నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆలయ పాలకమండలి.. ఇక, కార్తీక శనివారం, ఆదివారం, సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో కూడా స్పర్శ దర్శనాలు రద్దుచేశారు.. రద్దీ రోజుల్లో భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తారు. కార్తీకమాసం సాధారణ రోజులలో అంటే.. వీకెండ్, వారం ప్రారంభంలో.. కాకుండా మిగతా రోజుల్లో.. స్పర్శ దర్శనానికి 4 విడతలుగా అనుమతి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. భక్తులు కార్తీక దీపాలు వేలిగించేందుకు శివ మాడవిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది శ్రీశైల మల్లికార్జునస్వామి దేవస్థానం.
నేడు సీఎం కేసీఆర్ షెడ్యూల్ ఇదే..!
తెలంగాణలో ఎన్నికలకు మరి కొన్ని రోజలు సమయం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముమ్మరంగా ప్రచారం చేస్తు్న్నారు. కాగా, నిన్నటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారం స్టార్ట్ చేశారు. అయితే, ఇందులో భాగంగా నిన్న అశ్వరావుపేట, పినపాక, భద్రాచలంతో పాటు నర్సంపేటలో ప్రజా ఆశీర్వాద సభలలో ఆయన పాల్గొన్నారు. మొత్తంగా 16 రోజుల పాటు కేసీఆర్ రెండో విడత ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ 16 రోజులలో 54 నియోజకవర్గాలలో గులాబీ బాస్ ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇక ఇవాళ పాలకుర్తి, నాగార్జున సాగర్ (హాలియా), ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇక, ఈనెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభతో తన ప్రచారాన్ని గులాబీ బాస్ కేసీఆర్ ముగిస్తారు. అంతకుముందు మొదటి విడత ప్రచారంలో దాదాపు 74 నియోజకవర్గాలలో ఆయన ప్రచారం చేశారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి సింగిల్ గానే కేసీఆర్ ప్రచారాలు చేస్తున్నారు. అయితే, కేసీఆర్ ఈ సారి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి గజ్వేల్ అయితే.. మరోకటి కామారెడ్డి నియోజకవర్గం.. ఇక, నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
నేడు హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు.. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
నేడు హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏలో రాత్రి 7 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు సదర్ ఉత్సవ్ మేళా జరగనుంది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాచిగూడ ఎక్స్ రోడ్స్ నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వెహికిల్స్ కు పర్మిషన్ రద్దు చేశారు. వీటిని కాచిగూడలోని టూరిస్ట్ హోటల్ వైపు మళ్లించనున్నారు. విట్టల్‌వాడి ఎక్స్ రోడ్స్ నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు ట్రాఫిక్‌ను రాంకోటి ఎక్స్ రోడ్స్ వైపుకు మళ్లీంచారు. ఇక, రాజ్‌మొహల్లా నుంచి వచ్చే వాహనాలను అనుమతించరు. సాబూ షాప్ పాయింట్ దగ్గర రాంకోటి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లీంచనున్నారు. రెడ్డి కళాశాల నుంచి వెహికిల్స్ ను బర్కత్‌పురా వైపు మళ్లించనున్నారు. అయితే, పాత బర్కత్‌పురా పోస్టాఫీసు నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే ట్రాఫిక్‌కు పోలీసులు చెక్ పెట్టారు. క్రౌన్ కేఫ్ లేదా లింగంపల్లి వైపు మళ్లిస్తారు. దీంతో పాటు పాత ఎక్సైజ్ ఆఫీస్ లైన్ నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను విట్టల్‌వాడి వైపుకు మళ్లీంపు.. బర్కత్‌పురా చమన్ నుంచి వైఎంసీఏ, నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను బర్కత్‌పురా ఎక్స్ రోడ్స్ వైపు లేదా టూరిస్ట్ హోటల్ వైపుకు మళ్లీంచనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. అలాగే, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ నుంచి రెడ్డి కాలేజీ వైపు వెళ్లే వాహనాలను నారాయణగూడ ఎక్స్ రోడ్స్ వైపు మళ్లించనున్నారు. ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు.. 6 బంతుల్లో 6 వికెట్లు!
క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఎవరూ ఊహించని రీతిలో బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేస్తే.. బౌలర్లు హ్యాట్రిక్ తీస్తుంటారు. ఇప్పటివరకు 6 బంతుల్లో 6 సిక్సులు నమోదయినా.. 6 బంతుల్లో 6 వికెట్లు ఎవరూ తీయలేదు. తాజాగా ఈ ఫీట్ నమోదైంది. ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ గారెత్ మోర్గాన్.. 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టాడు. గోల్డ్‌కోస్ట్ ప్రిమియర్ లీగ్ డివిజన్-3 టోర్నీలో నెరాంగ్ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్న మోర్గాన్.. సర్ఫర్స్ పారడైజ్ సీసీపై ఈ అరుదైన ఘనత సాధించాడు. 40 ఓవర్లలో 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్ 39 ఓవర్లకు 4 వికెట్స్ కోల్పోయి 174 రన్స్ చేసింది. 6 బంతుల్లో 5 పరుగులు చేస్తే సర్ఫర్స్ విజయం సాధిస్తుంది. ఇక సర్ఫర్స్ విజయం లాంఛనమే అనుకున్నారు అందరూ. ఈ తరుణంలో ముద్గీరాబా నెరంగ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ అద్భుతం చేశాడు. చివరి ఓవర్‌లో ఒక్క పరుగూ ఇవ్వకుండా.. ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. గారెత్ దెబ్బతో సర్ఫర్స్ జట్టు ఆలౌట్ అయింది. దాంతో ముద్గీరాబా నెరంగ్ టీమ్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. గారెత్ మోర్గాన్ వేసిన 6 బంతుల్లో తొలి నాలుగు క్యాచ్ ఔట్స్ కాగా.. మిగతా రెండు బౌల్డ్ ఔట్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గారెత్ 7 ఓవర్లు వేసి 7 వికెట్స్ పడగొట్టి 16 రన్స్ ఇచ్చాడు. అంతకుముందు సర్ఫర్స్ ప్యారడైజ్ ఓపెనర్ జేక్ గార్లాండ్‌ని గారెత్ ఔట్ చేశాడు. గారెత్ బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. 39 పరుగులతో టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు. ఓటమి అంచుల వరకూ వెళ్లిన ముద్గీరాబా నెరంగ్ జట్టును గారెత్ ఊహించని విధంగా గెలిపించాడు.
సూర్యకుమార్ ఔట్.. స్పెలిస్ట్ స్పిన్నర్ ఇన్! న్యూజిలాండ్‌పై బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే
బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో స్పెలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. కివీస్ బ్యాటర్లలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉండడం ఓ కారణం అయితే.. వాంఖడే స్టేడియం పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందనే అంచనాలు మరో కారణం. అయితే అశ్విన్ జట్టులోకి వస్తే భారత్ బ్యాటింగ్ బలహీనం అవుతుంది. నాకౌట్ మ్యాచ్ కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. భారత్ పేస్, స్పిన్ విభాగాలు పటిష్టంగా ఉన్నాయి. మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు వికెట్స్ తీస్తూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. షమీ, కుల్దీప్, జడేజాలు ఓ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్స్ పడగొట్టి ప్రత్యర్థులను హడలెత్తించారు. బుమ్రా, సిరాజ్ ఆరంభంలోనే వికెట్స్ తీస్తూ మంచి ఆరంభం అందిస్తున్నారు. అందరూ చెలరేగితే కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడం కష్టమేమీ కాదు. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్/రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉందని అంచనా..
రతికాను సపోర్ట్ చేస్తున్న శివాజీ.. మరోసారి రెచ్చిపోయిన అమర్..
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతుంది.. ఈ వారం నామినేషన్స్ వాడి వేడిగా సాగుతున్నాయి..గత వారం శివాజీ, రతిక, గౌతమ్, యావర్, భోలే నామినేట్ అయ్యారు. యావర్, భోలే డేంజర్ జోన్లోకి వచ్చారు. తక్కువ ఓట్లు తెచ్చుకున్న భోలే ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో శివాజీ రతికాకు హితబోధ చేస్తుంటాడు.. ఎప్పుడూ లేట్ గా మొదలు పెట్టే అమ్మడుకు ఈసారి బిగ్ బాస్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.. ఇప్పుడు ఆలస్యం చేస్తే నేరుగా బిగ్ బాసే నామినేట్ చేస్తారని హెచ్చరించారు. దీంతో రతికా శోభాశెట్టి పేరు చెప్పింది. గత వారం ఆమెకు ఇచ్చిన కెప్టెన్సీని సరిగా వినియోగించలేదని అందుకు నామినేట్ చేశానంటూ రీజన్ చెప్పుకొచ్చింది. అదే రీజన్ తో ప్రియాంక జైన్ కూడా నామినేట్ చేసింది.. ఇక వీరిద్దరూ రెచ్చిపోయారు.. ముగ్గురి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది.. వీరి మాటల్లోకి నాగ్ సార్ ను లాగారు. ప్రతి దానికి మీకు నాగ్ సారే కావాలిగా ఒకసారి సార్ ను హౌజ్ లోకి రమ్మందాం.. అప్పుడు తెలుస్తుంది అంటూ రతికా అన్న మాటలకు.. శోభా ఏమో నువ్వు పిలిస్తే నాగ్ సార్ వస్తాడు కావొచ్చు.. మేం పిలిస్తే రాడు అనడం ఇంట్రెస్టింగ్ గా మారింది.. ఇక అర్జున్ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశారు. ప్రశాంత్ కొన్ని సందర్భాల్లో ప్రవర్తించే తీరు బాగోలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య కాస్తా వాగ్వాదం జరిగింది. శివాజీకి మద్దుతుగా మాట్లాడటం సరికాదంటూ అర్జున్ వాదించారు. నాకు అనిపించింది చేశానంటూ పల్లవి ప్రశాంత్ బదులిస్తూ వచ్చారు..
‘కేసీఆర్’పై చేస్తున్న నా సినిమాని ఎలక్షన్ కమీషన్ ఆపేసింది
జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా రాకింగ్ రాకేష్ కు మంచి గుర్తింపు ఉంది. చిన్న పిల్లలో ఆయన చేసే స్కిట్లను టీవీ ఆడియెన్స్ బాగా ఇష్టపడుతుంటారు. KCR సినిమా విషయంలో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ… “నా సినిమాని నవంబర్ 17న కానీ 24న కానీ రిలీజ్ చెయ్యాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోని రిలీజ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో ఎలక్షన్ కమిషన్… ఎన్నికల సమయంలో ప్రజలని ప్రేప్రేపించే ఏ రాజకీయ సినిమా రిలీజ్ కాకూడదు అని చెప్తూ నా సినిమా విడుదలని ఆపేసింది. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, చట్టం ప్రకారమే నా సినిమా రిలీజ్ ఆగింది. ఇది కూడా నా మంచికే అనుకుంటున్నాను. ఇకపై నా సినిమాని మరింతగా ప్రమోట్ చేసుకునే టైమ్ దొరికింది.” అంటూ రాకింగ్ రాకేష్ లైవ్ వీడియోలో చెప్పాడు. మరి తెలంగాణ ఎన్నికల తర్వాత KCR సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పటికైతే కొత్త రిలీజ్ డేట్ విషయంలో రాకేష్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
అనిరుధ్-ప్రేమ్ రక్షిత్-ఎన్టీఆర్… ఈ కాంబినేషన్ స్క్రీన్స్ ని తగలబెట్టేస్తాయి
ఎన్టీఆర్, కొరటాల శివ ‘దేవర’ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ కి రిపేర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర సినిమా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి… యాక్షన్ సీన్స్‌నే తెరకెక్కిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న దేవర టీమ్, నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్స్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న దేవర, గోవా షెడ్యూల్ లో ఒక సూపర్ సాంగ్ షూట్ ని కూడా కంప్లీట్ చేసుకుందట. దాదాపు 2000 మంది డాన్సర్స్ తో ఈ సాంగ్ ని షూట్ చేశారట. ఎన్టీఆర్ ఎలాంటి డాన్సర్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ డాన్సర్ కి అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తగిలితే థియేటర్స్ లో ఫైర్ వర్క్స్ జరిగినట్లే. ఇప్పుడు ఈ ఇద్దరికీ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా కలిసాడు. అనిరుధ్ కంపోజ్ చేసిన సూపర్ ట్యూన్ కి స్టెప్స్ కంపోజ్ చేసాడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఎన్టీఆర్-ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కాంబినేషన్ లో సూపర్ సాంగ్స్ ఉన్నాయి. ఈ ఆస్కార్ మాస్టర్ ఎన్టీఆర్ తో స్టెప్స్ వేయించిన ప్రతిసారీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవర ఆ సాంగ్స్ ని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో కూర్చోబోతుంది. కెరీర్ బెస్ట్ సాంగ్ ని అనిరుధ్ కంపోజ్ చేసాడు అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అదే నిజమైతే దేవర సాంగ్… పాన్ ఇండియా థియేటర్స్ కి షేక్ చేయడం గ్యారెంటీ.