Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ పై పాక్ మాజీ క్రికెటర్ దారుణ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన చూపించి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. బాబర్ అజామ్ సారథ్యంలోని జట్టు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించలేక ఐదో స్థానంలో నిలిచింది. ఆ జట్టు 9 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్టుపై ఓటమిని ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టుపై.. ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్ల పైన.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ అంశాలను చర్చిస్తూ పాకిస్తానీ మాజీ ఆటగాడు కొన్ని చెడు వ్యాఖ్యలు చేశాడు.
Rohit Sharma: గతాన్ని పట్టించుకోము.. రేపటి మ్యాచ్పైనే ఫోకస్
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్.. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో నోరుజారాడు. అతను తన పరిమితులను మరిచిపోయి బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యారాయ్ గురించి చెడుగా మాట్లాడాడు. జట్టు సభ్యుల్లోనూ, బోర్డులోనూ సంకల్పమే సరిగా లేదని చెబుతూ… ఐశ్వర్యా రాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారా? అంటూ అసందర్భ ప్రేలాపనలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై భారత్ లోనే కాదు, పాకిస్థాన్ లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే, రజాక్ ఈ వ్యాఖ్యలు చేస్తుండగా…. ఆ సమయంలో వేదికపై అతడి పక్కనే పాక్ మాజీలు షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, ఉమర్ గుల్, యూనిస్ ఖాన్, సయీద్ అజ్మల్, కమ్రాన్ అక్మల్ ఉన్నారు.
Chiranjeevi: జవాన్ పాటకు చిరు స్టెప్స్.. ఆ గ్రేస్ ను ఎవరు కొట్టలేరు అంతే
మరోవైపు.. రజాక్ వ్యాఖ్యలను పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ తప్పుబట్టాడు. రజాక్ వేసిన ఈ కుళ్లు జోకును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపాడు. ఈ విధంగా పోల్చడం ద్వారా ఏ మహిళను అవమానించరాదని హితవు పలికాడు. అతను ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అతడి పక్కన ఉన్నవారు అభ్యంతరం చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. కానీ వాళ్లు కూడా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ అతడి కామెంట్లను ఎంజాయ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?