భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. భార్య రితికా సజ్దే నవంబర్ 15న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ బీసీసీఐ నుంచి సెలవును అభ్యర్థించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చని తెలుస్తోంది
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. టీమ్ ఇండియా ఈ విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు.
మహిపాల్ లోమ్రోర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో మొదటి ట్రిపుల్ సెంచరీని సాధించాడు. 253 బంతుల్లో తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. అందులో 8 సిక్సర్లు, 18 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడు బ్యాటింగ్ చేశాడు. దీంతో.. మహిపాల్ 357 బంతుల్లో తన ట్రిపుల్ సెంచరీని పూర్తి చేశాడు. మహిపాల్ 360 బంతుల్లో 13 సిక్సర్లు, 25 ఫోర్ల సాయంతో అజేయంగా 300 పరుగులు చేశాడు.
సౌతాఫ్రికా-భారత్ జట్ల మధ్య డర్బన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. సౌతాఫ్రికా గడ్డపై చెలరేగుతున్నారు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ బరిలోకి దిగారు. అయితే.. బిగ్ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ (7) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకోగా.. మరో ఓపెనర్ శాంసన్ అర్ధ సెంచరీతో చెలరేగారు. క్రీజులోకి దిగిన నుంచి శాంసన్ సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.
ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను రిటెన్షన్, రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఉన్నదంతా మెగా వేలం ఎప్పుడు జరుతుందనేది. మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఏ ఏ ఆటగాళ్లను తీసుకుంటారు... ఏఏ ఆటగాళ్లు ఏ జట్టుకు వెళ్తారనేది క్రికెట్ అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది.
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. రెండో రోజు టీమిండియా పట్టు బిగించింది. కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9 పరుగులు చేసింది.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా క్రికెట్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 233 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.2 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి ఛేదించింది.
రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ D మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ సాధించి జట్టు స్కోరును పెంచాడు.
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరిగింది. టైటిల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 32 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేతగా న్యూజిలాండ్ అవతరించింది.
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది. ఒమన్‌లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందు టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.