ఐపీఎల్లో మరో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆదివారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని సైతం పంజాబ్ కింగ్స్ చేధించింది. ఇరు జట్ల ఆటగాళ్లు బౌండరీలతో డీవై పాటిల్ స్టేడియాన్ని మోతెక్కించారు. దీంతో అభిమానులకు కావాల్సినంత మజా దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205/2 స్కోరు సాధించింది. కెప్టెన్ డుప్లెసిస్ (88), విరాట్ కోహ్లీ (41), దినేష్ కార్తీక్ (32), అనుజ్ రావత్ (21)…
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఎంత పటిష్టమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్.. ఓటముల్లో కూడా రికార్డులు నెలకొల్పుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు ప్రతి ఐపీఎల్ సీజన్లో ఆ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోతూనే వస్తోంది. తాజాగా ఈ సీజన్ ఐపీఎల్‌లోనూ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. దీంతో…
ఐపీఎల్ 15వ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్రారంభించింది. పటిష్ట ముంబై ఇండియన్స్ జట్టును 4 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ముంబై ఇండియన్స్ విధించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఉఫ్ మని ఊదేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా లలిత్ యాదవ్ (48 నాటౌట్), అక్షర్ పటేల్ (38 నాటౌట్) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి ఢిల్లీ జట్టును గెలిపించారు. దీంతో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ బూడిద పాలైపోయింది. పృథ్వీ షా (38),…
హాట్ హాట్‌గా సాగుతున్న సమ్మర్లో క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ కూల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతోంది. ఇప్పటికే ఐపీఎల్ సమరం ప్రారంభమైంది. మే 29 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సుమారు మూడు నెలల పాటు ఐపీఎల్ నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ను అందించనుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను ఎలా చూడాలి అంటూ ఆలోచనలో పడ్డారు. టీవీ లేదా డిస్నీ హాట్‌స్టార్ లేని వారు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు. అయితే వాళ్లు తమ ఫోన్లో జియో టీవీ లేదా…
ఎన్నో ఆశలతో న్యూజిలాండ్ వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు రిక్త హస్తాలతో స్వదేశానికి వచ్చేస్తోంది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆదివారం నాడు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలై.. తద్వారా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ టీమ్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఓడినప్పటికీ చివరి వరకూ మన మహిళలు పోరాడిన తీరు అద్భుతమని రాహుల్ గాంధీ కొనియాడారు. ప్రపంచకప్…
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. నిబంధనల ప్రకారం ప్రతి టీమ్ నలుగురు విదేశీ ఆటగాళ్లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంటుంది. కానీ రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్, వెస్టిండీస్ ఆటగాడు ఆర్.పావెల్‌కు మాత్రమే జట్టులో అవకాశం కల్పించింది. గతంలో 2011లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి…
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా కల చెదిరింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు వైఫల్యం చెందారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 277/7 స్కోర్ చేశారు. స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53), మిథాలీ రాజ్ (68), హర్మన్‌ప్రీత్ కౌర్ (48) రాణించారు. అనంతరం భారత్ నిర్దేశించిన…
ఐపీఎల్ 15వ సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో మొదలుపెట్టింది. శనివారం చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ధోనీ హాఫ్ సెంచరీ (50 నాటౌట్)తో రాణించగా మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోది…
ఐపీఎల్-15లో తొలి మ్యాచ్‌లోనే ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. కోల్‌కతాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత తడబడింది. అయితే ధోనీ రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అసలు 120 పరుగులన్నా చెన్నై చేస్తుందా అని సందేహాలు కలిగిన వేళ.. ఆ జట్టు ఏకంగా 131 పరుగులు చేసింది. ధోనీ (50 నాటౌట్), జడేజా (26 నాటౌట్) భాగస్వామ్యంతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 131 పరుగులు చేసింది.…
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 15 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలిసారిగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ జట్టు బరిలోకి దిగబోతోంది. అయితే కోల్‌కతా జట్టు ముగ్గురు విదేశీయులనే జట్టులోకి తీసుకోవడం గమనార్హం. శ్యామ్ బిల్లింగ్స్, రస్సెల్, నరైన్‌లను మాత్రమే తుది జట్టులో స్థానం కల్పించింది. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ కాన్వే,…