BCCI: మాజీ క్రికెటర్లకు గుడ్‌న్యూస్.. భారీగా పెన్షన్ పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ క్రికెటర్లు, అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చే పెన్షన్లను పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ పెన్షన్ పెంపు పురుషులతో పాటు మహిళా మాజీ క్రికెటర్లకు కూడా వర్తిస్తుంది. కనిష్ఠంగా రూ.15వేలు ఉన్న పెన్షన్‌ను రూ.30 వేలకు బీసీసీఐ పెంచింది. అంతేకాకుండా గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.70 వేలకు పెంచింది. ఆటగాళ్లకు కేటగిరీలుగా ఈ పెన్షన్ అందిస్తారు. తమ పెన్షన్లు పెంచాలని ఇండియన్ క్రికెటర్ అసోసియేషన్ (ICA) గత కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ తాజా నిర్ణయంతో ఇప్పటివరకు రూ.30వేలు పెన్షన్ పొందుతున్న మహిళా క్రికెటర్లకు ఇకపై రూ.52,500 పెన్షన్ లభిస్తుంది. 2003కు ముందు రిటైర్ అయిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు అందుకునే పెన్షన్ రూ.22,500 నుంచి రూ.45వేలకు పెరగనుంది. జూన్ 1 నుంచి పెన్షన్ పెంపు అమల్లోకి వస్తుందని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బీసీసీఐ నిర్ణయంతో 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లకు లబ్ధి చేకూరనుంది. ఐపీఎల్ నిర్వహణతో ఏటా వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోన్న బీసీసీఐ ఈ లాభాల్లో కొంత మొత్తాన్ని మాజీ క్రికెటర్లకు అందిస్తుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
I’m pleased to announce an increase in the monthly pension of former cricketers (men & women) and match officials. Around 900 personnel will avail of this benefit and close to 75% of personnel will be beneficiaries of a 100% raise.
— Jay Shah (@JayShah) June 13, 2022
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!