రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగో టీ20లో టీమిండియాలో మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. యువ పేసర్ అవేష్ ఖాన్ స్థానంలో అర్ష్ దీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో అవేష్ ఖాన్ గాయపడ్డాడు. అతడి చేతి వేలికి గాయమవ్వడంతో మ్యాచ్ మధ్యలోనే డగౌట్‌కు చేరాడు. ఈ క్రమంలోనే అవేష్ ఖాన్ నాలుగో టీ20కి దూరం కానున్నాడు.
కాగా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అవేష్ ఖాన్ పెద్దగా రాణించిందేమీ లేదు. మూడో టీ20లో బౌలర్లందరూ రాణించినా అవేష్ ఖాన్ మాత్రం విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తొలి టీ20లో 0/34, రెండో టీ20లో 0/17, మూడో టీ20లో 0/35తో అవేష్ ఖాన్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. అవేష్ ఖాన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నా మేనేజ్‌మెంట్ అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఎందుకంటే అతడు డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా అర్ష్‌దీప్ సింగ్‌ను తయారు చేసుకోవాలనే ఆలోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉంది.
Team India: ఏడాదిలో ఏడుగురు కెప్టెన్‌లు.. గందరగోళంలో ఆటగాళ్లు