టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. అయితే ఇప్పటికి మూడు మ్యాచ్‌లు టీమిండియా-సౌతాఫ్రికాల మధ్య జరుగగా.. అందులో మొదటి రెండు మ్యాచ్‌లు సౌతాఫ్రికా కైవవం చేసుకుంది. అయితే మూడో మ్యాచ్ టీమిండియా ఖాతాలో పడగా.. నేడు నాలుగో మ్యాచ్ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సఫారీలు బౌలింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియాకు బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని టీమిండియా సారథి రిషబ్ పంత్ వెల్లడించాడు.
అటు, దక్షిణాఫ్రికా జట్టులో గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ తిరిగి జట్టులోకి రావడంతో.. బౌలింగ్ ను బలోపేతం చేసేందుకు మార్కో జాన్సెన్, లుంగీ ఎంగిడీలను కూడా తుదిజట్టులోకి తీసుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే దెబ్బతగిలింది.. 13 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన గైక్వాడ్.. ఎంగిడి బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 24 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 4 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. జాన్సెన్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు.