టెస్టుల్లో ఇటీవల కాలంలో ఇంగ్లండ్ దారుణ పరాజయాలను చవిచూస్తోంది. యాషెస్ సిరీస్ నుంచి ఆ జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. చివరి 17 టెస్టుల్లో ఇంగ్లండ్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. దీంతో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ నైతిక బాధ్యత వహిస్తూ తన కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. ఇది తనకు ఎంతో కఠిన నిర్ణయం అయినా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నట్లు రూట్ వివరించాడు. అంతేకాకుండా…
డర్బన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేశవ్ మహరాజ్ బౌలింగ్ ధాటికి 54 పరుగులకే ఆలౌటైంది. దీంతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. గతంలో 2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 43 పరుగులకే ఆలౌటై బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. డర్బన్ వేదికగా జరిగిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. కాగా…
ఐపీఎల్లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన తమ జట్టును ఓపెనర్ కేఎల్ రాహుల్ (68), ఆల్‌రౌండర్ దీపక్ హుడా (51) హాఫ్ సెంచరీలతో రాణించి తమ జట్టుకు మంచి స్కోరు అందించారు. కేఎల్ రాహుల్ 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 68 పరుగులు చేశాడు. దీపక్ హుడా 33 బంతుల్లో…
అంతర్జాతీయ క్రికెట్లో మరో స్టార్ క్రికెటర్ శకం ముగిసింది. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేశాడు. హామిల్టన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్ 16 బంతుల్లో ఒక ఫోర్ సాధించి 14 పరుగులు చేసి అవుటయ్యాడు. టేలర్‌కు ఇది చివరి వన్డే కావడంతో అతడు అవుట్ కాగానే స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. న్యూజిలాండ్ క్రికెటర్లే కాకుండా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా రాస్…
ఐపీఎల్లో కీలక మ్యాచ్‌కు చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ సిద్ధమైంది. కాసేపట్లో పంజాబ్ కింగ్స్ టీమ్‌తో ఆడబోయే మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై టీమ్ ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్లోకి అడుగుపెట్టిన ఆ టీమ్‌కు వరుస పరాజయాలు షాకిచ్చాయి. ముఖ్యంగా బౌలింగ్‌లో జడేజా నేతృత్వంలోని జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ జోర్డాన్‌ను తుది…
క్రికెట్ ఫార్మాట్లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తన సత్తా నిరూపించుకుంది. పురుషుల జట్టుతో తీసిపోని రీతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టు కూడా వరుసగా టైటిళ్లు సాధిస్తోంది. న్యూజిలాండ్ వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 71 పరుగుల భారీ తేడాతో ఆసీస్ మహిళలు విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు భారీ…
2011లో సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 2) కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. తమ సీనియర్ ఆటగాడు సచిన్‌కు అందమైన బహుమతిని అందజేసింది. భారత్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో భారీ అంచనాల నడుమ టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో బంగ్లాదేశ్‌తో తమ…
ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 210/6 స్కోర్ చేయగా.. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైన విధానంపై దుమారం రేగుతోంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో విలియమ్సన్ క్యాచ్ అవుట్ అయ్యాడని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పూర్తి ఓవర్లు ఆడకుండానే చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. చివర్లో రబాడ (15) 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో పంజాబ్ ఆ మాత్రం…
గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాడు దీపక్ హుడాను అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో చరిత్ర సృష్టించాడు. దీంతో ఇప్పటివరకు మలింగ పేరిట ఉన్న రికార్డును బ్రావో బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు బ్రావో 171 వికెట్లు తీసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతడి తర్వాత స్థానంలో ఉన్న మలింగ…