న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌పై గెలిచిన ఆస్ట్రేలియాతో తుది సమయంలో ఇంగ్లండ్ తలపడనుంది. ఆదివారం నాడు ఈ రెండు జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే లీగ్ దశలో వరుసగా మూడు ఓటములతో సెమీస్ చేరడమే కష్టం అనుకున్న తరుణంలో ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత్…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (50) మెరుపు బ్యాటింగ్ చేశాడు. 27 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అతడు అవుటైనా శివమ్ దూబె (49) కూడా దూకుడుగా ఆడాడు. అయితే తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. దూబె 30…
ఐపీఎల్లో ఈరోజు సూపర్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగబోతోంది. మరి ఈ రెండు సూపర్ జట్లలో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. టాస్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక మార్పుతో లక్నో జట్టు బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన మోషిన్ స్థానంలో ఆండ్రూ టై జట్టులోకి…
బుధవారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. సాధించింది తక్కువ పరుగులే అయినా కోల్‌కతా బాగానే పోరాడింది. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని.. అయితే బ్యాటింగ్ విభాగం నిరాశపరిచిందని కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వివరించాడు. బెంగళూరు బౌలర్ హసరంగాను ఆడటంతో తాము పొరపాటు చేశామని పేర్కొన్నాడు. అతడి ఆఫ్ స్పిన్‌ను ఆటడంలో ప్రణాళికలు అమలు చేయడంలో తమ బ్యాట్స్‌మెన్ విఫలమై…
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ రోజు ఐపీఎల్ -2022లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతున్నాయి. అయితే టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బాట్స్‌తో తొలుత బరిలోకి దిగి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో సన్…
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీపై టీమిండియా స్పిన్నర్ చాహల్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఏడాది మెగా వేలంలో తనను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ ఈ హామీని ఆర్సీబీ తుంగలో తొక్కిందని చాహల్ విమర్శలు చేశాడు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ ఈ ఆరోపణలు చేశాడు. తాను ఆర్సీబీ టీమ్‌లో ఉండాలంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్లో తాను ఆర్సీబీని వీడి మరో…
టీమిండియా మాజీ ఆటగాడు, స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్లో మార్చి 29వ తేదీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సెహ్వాగ్ తన తొలి ట్రిపుల్ సెంచరీని సాధించింది ఈరోజే. ఈ ట్రిపుల్ సెంచరీ సెహ్వాగ్‌కే కాదు టీమిండియాకు కూడా తొలి ట్రిపుల్ సెంచరీ. పాకిస్థాన్‌లోని ముల్తాన్ వేదికగా మార్చి 29, 2004న ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా మళ్లీ…
ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా మహిళల ప్రపంచకప్ జరుగుతోంది. అయితే పురుషుల ప్రపంచకప్ ప్రైజ్ మనీతో పోలిస్తే మహిళల ప్రపంచకప్ ప్రైజ్ మనీ తక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పురుషుల, మహిళ ప్రపంచకప్ టోర్నీల ప్రైజ్ మనీల మధ్య సమానత్వం తీసుకొచ్చేందుకు ఐసీసీ అడుగులు వేస్తోంది. రాబోయే 8 ఏళ్లలో మహిళల క్రికెట్ ఈవెంట్లకు సంబంధించి జరిగే చర్చల్లో దీనిపై మరింత చర్చిస్తామని ఐసీసీ సీఈవో జియోఫ్ అలార్డైస్ అన్నారు. కాగా 2019లో జరిగిన పురుషుల…
ఐపీఎల్ ద్వారా మరో యువ కెరటం వెలుగులోకి వచ్చింది. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా లక్నో ఆటగాడు ఆయుష్ బదోనీ తన సత్తా చూపించాడు. అయితే అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే అతడు రికార్డు సృష్టించాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఆయుష్ బదోనీ మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా 41…
ఐపీఎల్లో రెండు కొత్త జట్లు ఈరోజు అమీతుమీ తేల్చుకున్నాయి. అయితే ఈ పోరు కేఎల్ రాహుల్ టీమ్‌పై హార్డిక్ పాండ్యా జట్టు విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీపక్ హుడా (55), ఆయుష్ బదోనీ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం…