విశాఖ టీ20లో దక్షిణాఫ్రికా 48 పరుగుల తేడాతో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా స్పందించాడు. ఒక్క ఓటమికే తమ జట్టును మార్చాలని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందని బవుమా అభిప్రాయపడ్డాడు. తొలి రెండు మ్యాచ్‌లలో భారత బౌలర్లను ఎదుర్కొన్న తరహాలో మూడో మ్యాచ్‌లో చేయలేకపోయిన మాట వాస్తవమని.. భారత స్పిన్నర్లు తమను కట్టడి చేశారని బవుమా అన్నాడు.
తొలి రెండు మ్యాచ్‌లలో కూడా ఆరంభంలో వికెట్లు పడ్డా మిడిలార్డర్ అద్భుతంగా ఆడిందని.. అయితే ఆ స్ట్రాటజీ మూడో మ్యాచ్‌లో రిపీట్ కాకపోవడంతోనే తమకు విశాఖ టీ20లో ఓటమి ఎదురైందని బవుమా వివరించాడు. భారత స్పిన్నర్లను ముందుగా రంగంలోకి దింపడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. తాము స్పిన్నర్లను ఆలస్యంగా రంగంలోకి దింపామన్నాడు. ఇదే రెండు జట్ల మధ్య తేడా అని పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లీ, బుమ్రా వంటి ఆటగాళ్లు లేకపోయినా భారత బలంగానే కనిపిస్తోందని బవుమా అన్నాడు. మూడో మ్యాచ్‌లో ఓడినా తాము ఇదే జట్టుతో నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు.
IPL Media Rights: టీవీ హక్కులు ‘స్టార్’కు.. డిజిటల్ హక్కులు ‘రిలయన్స్’కు