IND Vs NZ: టీమిండియాతో జరిగిన రెండో టీ20లో ఓటమి పాలైన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీ20కి కెప్టెన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ జట్టు స్వయంగా ప్రకటించింది. అతడి స్థానంలో పేసర్ టిమ్ సౌథీకి జట్టు పగ్గాలు అందిస్తున్నట్లు వెల్లడించింది. గతంలో కేన్ విలియమ్సన్ మెడికల్ అపాయింట్మెంట్ తీసుకున్నాడని.. అయితే అదే సమయంలో మ్యాచ్ జరుగుతుండటంతో అతడు దూరమయ్యాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వివరించింది. చాలాకాలంగా విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడని..…
Vijay Hazare 2022: విజయ్ హజారే ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా నాలుగు సెంచరీలు చేసిన జగదీశన్ తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. దీంతో రోహిత్ శర్మ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతడు డబుల్ సెంచరీ సాధించాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277 పరుగులు చేయడంతో లిస్ట్ A క్రికెట్లో అత్యధిక పరుగులు…
IND Vs NZ: మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రిషబ్ పంత్ (6) తీవ్రంగా నిరాశపరిచాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 36 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ (13), హార్దిక్ పాండ్యా (13) కూడా పెద్దగా రాణించలేదు. అయితే కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో…
IND Vs NZ: టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమిండియా నేరుగా న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు రెండో టీ20 జరగనుంది. బే ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా యువ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే…
Olympics: క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సి్ల్ (ఐసీసీ) చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది. నిజానికి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి చాలా ప్రయత్నాలు జరిగినా ఇవి ఫలించలేదు. ఎట్టకేలకు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌కు చోటు ఉండవచ్చని తెలుస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందంటూ బ్రిటీష్ వార్తాపత్రిక టెలిగ్రాఫ్ ప్రకటించింది. గత 100 సంవత్సరాలలో మొదటిసారిగా క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడలలో చేర్చనున్నట్లు…
IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టీ 20 జరగనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో భారత యువ జట్టు కివీస్‌తో తలపడనుంది. టీ 20 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు…
Andre Russell: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ బాటలో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటోను రస్సెల్ షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. అద్దం ముందు నిలుచుని న్యూడ్‌గా తీసుకున్న ఫోటోను రస్సెల్ షేర్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఫోటోలో తన జననాంగం కనబడకుండా పుర్రె బొమ్మ ఎమోజీతో కవర్ చేశాడు. ప్రస్తుతం ఈ…
IND Vs NZ: న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన భారత్- న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. టాస్ వేసే సమయానికి స్టేడియాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఈ కారణంగా టాస్ కూడా పడలేదు. పలు మార్లు గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించడం…