Team India: 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 15 ఏళ్లు గడిచినా మరోసారి టీమిండియా మాత్రం మరోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడలేకపోయింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో మాత్రం భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే సెమీస్‌కు చేరిన రోహిత్ సేన ఇంగ్లండ్‌తో తలపడనుంది. సమష్టిగా ఆడితే ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడం అసాధ్యమేమీ కాదని అభిమానులు విశ్వసిస్తున్నారు. అటు తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి పాకిస్థాన్ ఫైనల్…
South Africa: క్రికెట్లో దురదృష్టం వెంటాడే జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికా మాత్రమే. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అందరికంటే ముందు సెమీస్ చేరుతుందని భావించిన జట్టు దక్షిణాఫ్రికా. కానీ అనూహ్యంగా దక్షిణాఫ్రికా సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. బంగ్లాదేశ్‌పై భారీ విజయం, టీమిండియా అద్భుత గెలుపు చూసి దక్షిణాఫ్రికా సెమీస్‌కు వెళ్లడం లాంఛనమే అని అందరూ భావించారు. కానీ టోర్నీ ప్రారంభం, టోర్నీ ముగింపు ఆ జట్టు దురదృష్టాన్ని మరోసారి చాటిచెప్పాయి. సూపర్-12లో దక్షిణాఫ్రికా తన…
IND Vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో అడిలైడ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. రోహిత్ (15) మరోసారి విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ 26 పరుగులు…
Roger Binny: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఐసీసీ సహరిస్తోందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన అఫ్రిది వ్యాఖ్యలపై పెదవి విప్పారు. అఫ్రిది చేసిన ఆరోపణలు సమంజసం కాదని అసహనం వ్యక్తం చేశారు. ఐసీసీ టీమిండియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించడం సరికాదని.. ఐసీసీ అన్ని జట్ల విషయంలో ఒకేలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఐసీసీ పక్షపాతం…
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్, ధోనీ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ కోహ్లీ మాత్రమే. గతంలో పరుగుల వరద పారించిన కోహ్లీ మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. అయితే ఇటీవల ఆసియా కప్ సందర్భంగా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన అతడు టీ20 ప్రపంచకప్‌లో మరోసారి రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో నాలుగు…
Afghanistan: టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్-12 దశలో ఆప్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే చివరి మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియాపై గెలిచినంత పనిచేసింది. చివరకు 4 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. మెగా టోర్నీలో ఒక్క విజయం కూడా లేకుండా తమ జట్టు నిష్క్రమించడంతో ఆప్ఘనిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. జట్టు ఎంపికలో…
Team India: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ అండతోనే టీమిండియా విజయాలు సాధిస్తుందని ఆరోపించాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని షాహిద్ అఫ్రిది అన్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఐసీసీ ఒత్తిడితోనే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నా.. అంపైర్లు మ్యాచ్ నిర్వహించారని విమర్శలు చేశాడు. ఎలాగైనా టీమిండియా సెమీస్‌కు వెళ్లాలనే ఆలోచనతోనే ఐసీసీ ఇలా…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో శుక్రవారం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తప్పిదం జరిగింది. ఆప్ఘనిస్తాన్ బౌలర్ ఓవర్‌కు ఐదు బంతులే వేశాడు. కానీ ఈ విషయాన్ని అంపైర్లు గమనించలేదు. కానీ లైవ్‌లో మ్యాచ్ చూస్తున్న అభిమానులు మాత్రం ఈ తప్పిదాన్ని గుర్తించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో ఓవర్‌ను ఆప్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ వేశాడు. తొలి…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని జట్టు ఆప్ఘనిస్తాన్ మాత్రమే. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నా అవి వరుణుడి కారణంగా వచ్చాయి. అయితే తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ గెలిచినంత పని చేసింది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు తుదికంటా పోరాడింది. కానీ తృటిలో విజయం చేజార్చుకుంది. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్ 164 పరుగులు మాత్రమే…
T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ ఈ హ్యాట్రిక్ సాధించడం విశేషం. టీ20ల్లో అగ్రశ్రేణి జట్టు న్యూజిలాండ్‌పై పసికూన ఐర్లాండ్ జట్టు హ్యాట్రిక్ నమోదు చేయడం నిజంగా అద్భుతమే అని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా 19వ ఓవర్లో జోష్ లిటిల్ బౌలింగ్‌కు దిగి వరుస బంతుల్లో కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్,…