IND vs BAN: బంగ్లాదేశ్‌తో భారత్ చావో రేవో.. మనోళ్లు నెగ్గుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs BAN: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్ నేడు ఢాకా వేదికగా జరగనుంది. తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో గెలిపొందిన ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో ఎలాగైనా నెగ్గి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని భారత్ కోరుకుంటోంది. ఈ కీలక మ్యాచ్ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైతే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను చేజార్చుకోనుంది. ఈ కీలక పోరులో సత్తా చాటాలని రోహిత్ సేన కోరుకుంటోంది.
భారత్‌ను ముఖ్యంగా టాపార్డర్ బ్యాటింగ్ వైఫల్యాలు వెంటాడుతున్నాయి. స్పిన్నర్లను ఆడటంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. తొలి వన్డేలో బ్యాటింగ్‌లో తడబడిన టీమిండియా బంతితో రాణించి గట్టెక్కేలా కనిపించింది. కానీ గెలుపు ముంగిట బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఒక్క వికెట్ తీయలేక భారత్ పరాజయాన్ని చవిచూసింది. మెహదీ హసన్, ముస్తాఫిజుర్ చివరి వికెట్‌కు ఏకంగా 51 పరుగులు జోడించి బంగ్లాను గెలిపించారు. ఆ ఒక్క వికెట్ తీయలేకపోవడంలో బౌలర్ల వైఫల్యం నిజమే కానీ.. స్టార్లతో నిండిన బ్యాటింగ్ లైనప్ మరింత బాధ్యత తీసుకోవాల్సివుంది. చివరిగా ధోనీ సారథ్యంలో 2015లో బంగ్లాదేశ్‌లో జరిగిన వన్డే సిరీస్‌ను 1-2తో భారత్ కోల్పోయింది. ఆ సిరీస్‌లో మూడో వన్డేలో మాత్రమే భారత్ నెగ్గింది. ఆ చరిత్ర పునరావృతం కాకుండా టీమిండియా జాగ్రత్తపడుతోంది.
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
Miss India 2023: మిస్ ఇండియా కావాలని భావిస్తున్నారా? ఇప్పుడే దరఖాస్తు చేసుకోండిలా..!!
ఈ కీలక మ్యాచ్‌లోనైనా రోహిత్, కోహ్లీ, శిఖర్ ధావన్‌లు చెలరేగాలని భారత్ ఆశిస్తోంది. టీమిండియా మరింత దూకుడుగా బ్యాటింగ్ చేయడం చాలా అవసరం. తొలి వన్డేలో 25 ఓవర్ల కంటే ఎక్కువ విలువైన డాట్ బాల్స్ ఆడారు. మరోవైపు బంగ్లాదేశ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. బౌలింగ్‌లో బలంగా ఉన్న బంగ్లా జట్టుకు.. బ్యాటింగ్‌లో సమస్యలు ఉన్నాయి. దానిని భారత్ ఉపయోగించుకుంటే విజయం సులభమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు