Vijay Hazare Trophy: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ మరో సెంచరీ సాధించాడు. అయినా మహారాష్ట్రకు నిరాశ తప్పలేదు. ఫైనల్లో ఆ జట్టుపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. షెల్డన్ జాక్సన్ అద్భుత సెంచరీ చేశాడు. 136 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133 నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత…
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత మహిళ జట్టును ప్రకటించారు. భారత్‌లోనే జరగనున్న ఈ టీ-20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
IND Vs BAN: ఈనెల 4 నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ టస్కిన్ అహ్మద్ వెన్నునొప్పి కారణంగా తొలివన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ మిన్హజుల్ అబెడిన్ తెలిపాడు. అతడి గాయం పురోగతిని బట్టి మిగతా మ్యాచ్‌లు ఆడటంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. మరోవైపు ఈ…
న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడు వన్డేల సిరీస్ న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి వన్డేను న్యూజిలాండ్ గెలుచుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం.
IND Vs NZ: క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తడబడింది. సిరీస్ సమం కావాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ధావన్ సేన 47.3 ఓవర్లలో 219 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సుందర్ రాణించకపోతే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. అతడు 51 పరుగులతో రాణించాడు. సుందర్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు ఓపెనర్లు ధావన్ (28), గిల్ (13) విఫలమయ్యారు.…
Team India: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలోనూ పంత్ విఫలమయ్యాడు. కేవలం 10 పరుగులకే అవుటయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్ ఆచితూచి ఆడతాడని అభిమానులు భావించారు. కానీ 16 బంతుల్లో రెండు ఫోర్లు సహాయంతో 10 పరుగులు చేసి మిచెల్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో సంజు శాంసన్ అభిమానులు పంత్‌ను సోషల్…
IND Vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఆడిన జట్టునే మూడో వన్డేలో టీమిండియా కొనసాగించింది. అటు న్యూజిలాండ్ మాత్రం ఓ మార్పు చేసింది. రెండో వన్డేలో ఆడిన బ్రాస్వెల్ను పక్కనపెట్టి ఆడమ్ మిల్నేను జట్టులోకి తీసుకుంది. వన్డే సిరీస్ కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరి గెలవాలి. మూడు మ్యాచ్‌ల ఈ…
Team India: ప్రస్తుతం టీమిండియాలో ఫామ్‌లో లేని ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు రిషబ్ పంత్. అతడు పదే పదే విఫలమవుతున్నా అవకాశాలు మాత్రం ఇంకా ఇస్తున్నారు. ఒకానొక సమయంలో నమ్మదగిన ఆటగాడిగా కొనసాగిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అనేక అవకాశాలు ఇస్తున్నా అతడి ఆటతీరులో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా పంత్ ఆటతీరుపై స్పందించారు. ‘ఎన్నడా…
Ruturaj Gaikwad: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డును సైతం బద్దలు కొట్టాడు. యువరాజ్ కేవలం ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే రుతురాజ్ మాత్రం 7 బంతుల్లో ఏడు సిక్సర్లు బాదాడు. మధ్యలో ఓ నోబాల్ పడటంతో ఒకే ఓవర్లో 43 పరుగులు వచ్చాయి. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా ఉత్తరప్రదేశ్‌లో…
Guinness Record: ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ లీగ్‌లలో ఐపీఎల్‌కు ఉన్నంత క్రేజ్ మరే లీగ్‌కు ఉండదు. తాజాగా ఐపీఎల్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చి చేరింది. ఈ ఏడాది మే నెలలో ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌కు ఏకంగా రికార్డు స్థాయిలో అభిమానులు హాజరు కావడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022…