T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు సెమీస్ బెర్తులు ఖరారవుతున్నాయి. ఈ టోర్నీలోనే సెమీస్‌కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. శుక్రవారం నాడు గ్రూప్-1లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి. ఇందులో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు ఉన్నాయి. 2.113 మెరుగైన రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్‌కు సెమీస్ బెర్తు ఖరారైంది. రెండో…
ICC Rankings: టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో మరోసారి తన సత్తా చూపాడు. తొలిసారిగా ఐసీసీ ర్యాంకుల్లో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ప్రస్తుత T20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తుండటంతో 863 పాయింట్లు సాధించి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. చాలా తక్కువ సమయంలో సూర్యకుమార్ నంబర్‌వన్ ర్యాంకును పొందాడు. మార్చి, 2021లో అరంగేట్రం చేసి తక్కువ కాలంలోనే ఈ ర్యాంకు పొందాడు. ఈ జాబితాలో 842 పాయింట్లతో పాకిస్థాన్…
IND Vs BAN: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒకే ఒక్క మార్పు చేసింది. గత మ్యాచ్‌లో రాణించని దీపక్ హుడాపై వేటు వేసింది. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అటు బంగ్లాదేశ్ కూడా ఒక మార్పు చేసింది. సౌమ్య సర్కార్ స్థానంలో షోరిఫుల్ ఇస్లాం జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ లాంటి అగ్ర జట్టును ఓడించిన జింబాబ్వేకు పసికూన నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై నెదర్లాండ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకోగా 19.2 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. సికిందర్ రజా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు 24 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. సీన్ విలియమ్స్…
Darren Sammy: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశకు వెస్టిండీస్ అర్హత సాధించకపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే తమ జట్టుకు ఈ పరిస్థితి దాపురించడానికి ఆర్ధిక విధానాలే కారణమని ఆరోపించాడు. ఆటగాళ్లకు తమ బోర్డు ఆర్ధిక భద్రత కల్పిస్తే జట్టు గాడిన పడుతుందని డారెన్ సామీ ఆశాభావం వ్యక్తం చేశాడు. బీసీసీఐ తరహాలో ఇతర లీగుల్లో తమ ఆటగాళ్లు ఆడటాన్ని వెస్టిండీస్ బోర్డు అడ్డుకోలేదని..…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అన్ని రంగాల్లో విఫలమైన రోహిత్ సేన పుంజుకుని బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడాల్సి ఉంటుంది. అయితే వరుణుడు ఎంతమేర సహకరిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. బంగ్లాదేశ్ జట్టుపై టీ20ల్లో టీమిండియాకు మంచి రికార్డే ఉన్నప్పటికీ.. 2016 టీ20 ప్రపంచకప్‌లో…
T20 World Cup: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మంగళవారం ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. గుర్బాజ్ 28, ఘని 27, ఇబ్రహీం 22 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు తీయగా లహిరు కుమార 2…
Shakib Al Hasan: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ప్రపంచకప్ గెలిచేందుకు రాలేదని, ఇండియాను ఓడించేందుకే వచ్చామని షకీబ్ చెప్పాడు. భారత్ ప్రపంచకప్ గెలిచేందుకు ఇక్కడకు వచ్చిందని.. కానీ తాము ప్రపంచకప్ గెలిచేందుకు ఇక్కడికి రాలేదని తెలిపాడు. తాము టీమిండియాను ఓడిస్తే ఆ జట్టు కలత చెందుతుందని తమకు తెలుసు అని..…
Prithvi Shaw: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో వన్డే, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కలేదు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పృథ్వీ షా విశేషంగా రాణించాడు. ఏడు మ్యాచుల్లో 47.50 సగటుతో 285 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతడి స్ట్రైక్ రేటు 191.28గా ఉంది. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నటిప్పటికీ పృథ్వీ షాకు టీమ్‌లో చోటు దక్కకపోవడంపై పలువురు…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సమరానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన రెండు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు వరుణుడి గండం పొంచి ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం అడిలైడ్‌లో బుధవారం నాడు 90 శాతం వర్షం కురిసే అవకాశం…