శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు హసరంగా విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు ఇవాళ (మంగళవారం) శ్రీలంక క్రికెట్‌కు తెలిపాడు.
2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టీవెన్ ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గత కొంత కాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌కు రిటైర్మింట్ ప్రకటించాడు.
నేను రోహిత్ శర్మకు ఒక సలహా ఇచ్చాను.. ఆ తర్వాత.. వరల్డ్ కప్‌లో ఏకంగా 5 సెంచరీలను బాదేశాడు అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా వరల్డ్ కప్ ముందు రోహిత్ ఫామ్‌లో లేడు.. ప్రపంచ కప్ కోసమే పరుగులన్నీ దాచిపెట్టుకుంటున్నాడు.. ప్రతీదానికీ ఓ కారణం ఉంటుందని నేను నమ్ముతా.. నా విషయంలోనూ ఇదే జరిగింది అని యువరాజ్ సింగ్ అన్నాడు.
సౌరాష్ట్రకి చెందిన సితాంశు కోటక్.. ప్రస్తుతం భారత A జట్టుకి హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఐర్లాండ్ టూర్లో టీమిండియాకి వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వెళ్తాడని వార్తలు వొచ్చాయి.. కానీ, లక్ష్మణ్ మాత్రం ఎన్సీఏలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడట.
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు కుప్పకూలిపోకుండా నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ మూడో రోజు శనివారం టీ విరామ సమయానికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (235 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 75 పరుగులు) అర్ధ సెంచరీ చేయగా.. బ్లాక్‌వుడ్ (16 నాటౌట్), అలిక్ అతనజ్ (13 నాటౌట్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా మూడో రోజు…
బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఉమెన్స్ జట్టు 226 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ 41.1 ఓవర్లలో స్కోరు 191/4...చేతిలో 6 వికెట్లతో మరో 53 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో మ్యాచ్ మలుపు తిరిగింది. హర్లీన్ డియోల్, దీప్తి శర్మ ఒకే ఓవర్లో రనౌట్ కావడంతో పాటు.. 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయిన భారత్ స్కోరును మాత్రం సమం చేసింది.
ఒకప్పటి మేటి జట్టు నిలిచిన వెస్టిండీస్.. టెస్ట్‌ల్లో టీమిండియాపై విజయం సాధించి దాదాపు రెండు దశాబ్దాల కాలం దాటిపోయిందంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మినా, నమ్మకపోయినా ఇదే నిజం. విండీస్ జట్టు లాస్ట్ టైం 2002లో జమైకాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుపై విజయం సాధించింది. అప్పటి నుంచి దాదాపు 21 సంవత్సరాలుగా విండీస్‌కు టీమిండియాపై ఇప్పటి వరకు గెలవలేదు.
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచిన ఆసీస్ మూడో టెస్టులో ఓటమిని చవిచూసింది. ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి ఇంగ్లండ్ తగ్గించింది. మరో రెండు టెస్టు మ్యాచులు మిగిలిన ఉన్న నేపథ్యంలో సిరీస్ గెలిచేందుకు ఇరు జట్లకు ఛాన్స్ ఉంది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీమ్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ (93 బంతుల్లో 9 ఫోర్లతో…
ప్రస్తుతం టీమిండియా వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో ఉంది. ఈ క్రమంలో జులై 12 నుంచి విండీస్ తో నెల రోజుల పాటు సిరీస్ లను భారత జట్టు ఆడనుంది. ఇందుకోసం భారత్ ఇప్పటికే కరేబియన్ దీవులకు చేరుకుంది. ఈ సంవత్సరంతో పాటు వచ్చే ఏడాది కూడా వరల్డ్ కప్ టోర్నమెంట్ జరుగనుంది. ఈ ఏడాది అక్టోబర్ తో పాటు 2024లో టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. అయితే.. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ లో…