టీమిండియా బ్యాటర్లకు షాక్ తగిలింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లు పతనమయ్యారు. బ్యాట్స్‌మెన్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ ర్యాంకింగ్స్‌లో పడిపోయారు. కాగా.. గురువారం నుంచి మెల్‌బోర్న్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా వారి ర్యాంకింగ్ దిగజారింది.
Read Also: MS Dhoni: కుమార్తె కోసం శాంతా క్లాజ్‌గా మారిన మహీ.. ఫోటో వైరల్
పెర్త్ టెస్టు తర్వాత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోగా.. తాజాగా ఐదో స్థానానికి పడిపోయాడు. రిషబ్ పంత్ కూడా ఈసారి ఆస్ట్రేలియాలో అద్భుతాలు చేయలేకపోయాడు. రెండు స్థానాలు కోల్పోయి 11వ స్థానానికి చేరుకున్నాడు. శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు కోల్పోయి 20వ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 21వ స్థానానికి దిగజారగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంకింగ్స్ కోల్పోతూనే ఉన్నాడు. ప్రస్తుతం 35వ స్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్‌గా గత ఐదు టెస్టుల్లో నాలుగింటిలో ఓడిపోయాడు. మరోవైపు.. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్.. 10 స్థానాలు ఎగబాకి 40వ స్థానానికి చేరుకున్నాడు. రాహుల్ మూడు మ్యాచ్‌ల్లో 47 సగటుతో 235 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
Read Also: OYO : అత్యధికంగా ఓయో బుక్ చేసుకున్న నగరాలు ఇవే.. హైదరాబాద్ టాప్?