గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. వచ్చే నెలాఖరిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా రీఎంట్రీ ఇస్తాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు.
కేప్‌టౌన్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రీడామణులు కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ (68*, 55బంతుల్లో), అయేషా నసీమ్ (43*, 25బంతుల్లో) అద్భుతంగా రాణించిన వేళ పాకిస్థాన్ భారత్‌కు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఏకపక్ష విజయం సాధించి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన మరో సారి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా కివీస్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల వేలం బీసీసీఐకి ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్‌లోనే ఐదు జట్ల అమ్మకానికిగానూ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం సమకూరింది.
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లు, వన్డేల్లో సత్తా చాటాడని.. తర్వాత టెస్టుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.