IND vs AUS: గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటను వర్షం కారణంగా ముందుగానే ముగించాల్సి వచ్చింది. KL రాహుల్, రవీంద్ర జడేజాల హాఫ్ సెంచరీల సహాయంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో క్రికెట్ టెస్టులో నాల్గవ రోజున భారత్ ఫాలో-ఆన్‌ను కాపాడుకుంది. నాల్గవ రోజు ముగియడంతో మ్యాచ్ డ్రాగా మారుతున్నట్లు కనిపిస్తోంది. జడేజా 123 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 77 పరుగులు చేశాడు. మరోవైపు కెఎల్ రాహుల్ 139 బంతుల్లో 84 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి 74.5 ఓవర్లలో భారత్ 252/9తో ఉంది.
Also Read: OnePlus Mobiles Release: ఒకేరోజు రెండు మొబైల్స్‌ను విడుదల చేయబోతున్న వన్‌ప్లస్
అడిలైడ్ టెస్టులానే గబ్బాలో కూడా భారత జట్టు బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. 4 పరుగులు మాత్రమే చేసి యశస్వి జైస్వాల్ అవుట్ అవ్వగా, గిల్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మరోమారు విరాట్ కోహ్లీ 3 పరుగులతో నిరాశ పరిచాడు. ఆ తర్వాత వచ్చిన పంత్ కూడా 9 పరుగులు చేసి వెనుతిరిగాడు. రోహిత్ శర్మ బ్యాడ్ ఫామ్ మరోమారు కొనసాగించాడు. కెప్టెన్ 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. మొదటి రెండు టెస్టులలో మంచి స్కోర్ చేసిన నితీష్ రెడ్డి కూడా 16 పరుగులతో వెనుతిరిగాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాల అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు చివరి వికెట్‌కు 39 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా టీమిండియాను ఫాలో-ఆన్ నుంచి కాపాడారు. 13 ఏళ్ల తర్వాత టీమిండియా ఫాలో ఆన్ ప్రమాదంలో పడబోతుండగా దాని నుండి వారు కాపాడారు.
Also Read: Today Gold Rates: తగ్గని బంగారం జోరు.. స్థిరంగా వెండి ధరలు