విశాఖ వేదికగా టీమిండియా ఆసీస్‌తో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే రెండో వన్డేలో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మొదటి వన్డేలో అతికష్టం మీద విజయం సాధించిన టీమిండియా.. రెండో వన్డేలో రాణించాలని చూస్తోంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ను ఆసీస్ టీం ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాని నిలబెడుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు.
న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్ జట్టును ఓడించే సత్తా శ్రీలంకకు లేదని మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ అన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ కోసం ఇండియా, శ్రీలంక మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో సంజయ్ ముంజ్రేకర్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.
భారత జట్టు ఓపెనర్ పృథ్వీ షా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. పృథ్వీ షా ఇటీవల ఓ మోడల్‌తో వివాదం కారణంగా వెలుగులోకి వచ్చింది.అయితే ఈ వివాదం చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ.. పృథ్వీ దీనిపై ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు.
కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు శస్త్రచికిత్స పూర్తయినట్లు తెలుస్తోంది. శస్త్ర చికిత్స కోసం బుమ్రాను బీసీసీఐ న్యూజిలాండ్‌కు పంపిచింది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఆసీస్ జట్టు మూడో టెస్టులో భారత్‌పై ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది.
ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఆటతీరును కనబరిచింది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియాకు మూడో టెస్టువో మాత్రం ఆస్ట్రేలియా గట్టి పోటీనిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.