భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకం సృష్టిస్తున్నాడు. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 90 ఓవర్లలో 272 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటాడు. 122 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా ఆజింక్యా రహానె 40 పరుగులతో క్రీజులో నిలబడ్డాడు. అయితే రెండో రోజు తొలి సెషన్ మొత్తం వరుణుడి వల్ల…
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. కేఎల్ రాహుల్ 122 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60) తో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం అందించాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. ఓపెనర్లు రాణించడంతో…
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటికే భారత జట్టుకు అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్‌గా ఘనత అందుకున్న కోహ్లీ తాజాగా దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ద్వారా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్‌ల్లో టాస్ నెగ్గాడు. దీంతో…
దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు శుభారంభం దక్కింది. ఈ టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా… ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (60), కేఎల్ రాహుల్ (51 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో తొలి వికెట్‌కు వీరి జోడి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే 117 పరుగుల వద్ద మయాంక్ అవుటయ్యాడు. Read Also: త్వరలో రాజకీయాల్లోకి హర్భజన్ సింగ్ అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన పుజారా ఒక్కబంతికే క్యాచ్…
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ మాట్లాడుతూ… పేపర్ మీద టీమిండియా జట్టు బలంగా కనిపిస్తున్నా గెలుపు మాత్రం తమదే అని ధీమా వ్యక్తం చేశాడు. హోం గ్రౌండ్లో పరిస్థితులు తమకే అనుకూలంగా ఉంటాయని ఎల్గార్ తెలిపాడు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టీమిండియా మంచి ఆటతీరును కనిపరిచిందని.. అందుకే తాము…
క్రిస్మస్ సందర్భంగా పలువురు క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ కూడా సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా వేర్వేరు సంవత్సరాల్లో తాను క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న ఫోటోలను కూడా సచిన్ షేర్ చేశాడు. ఇందులోని ఓ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్య గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్యగా ఓ బాలికతో సందడి చేస్తున్నట్లు ఉంది. ఈ ఫోటో 2018లో తీసినట్లు సచిన్…
టీమిండియాకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, ధోనీ వంటి దిగ్గజాల నేతృత్వంలో కూడా భారత్ టెస్ట్ సిరీస్ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు టీమిండియాను సువర్ణావకాశం ఊరిస్తోంది. ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఈసారి సిరీస్ సాధించొచ్చని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కసారి మాత్రమే 250 ప్లస్ స్కోరు చేసిందని.. అందుకే ఆ సిరీస్…
ఈనెల 26 నుంచి టీమిండియాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ స్టార్ బౌలర్ ఆన్రిచ్ నార్జ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే అతడి స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇప్పటికే 20 మంది సభ్యులతో జట్టును ప్రకటించిన నేపథ్యంలో నార్జ్ స్థానంలో కొత్త ఆటగాడిని సెలక్ట్ చేయాల్సిన అవసరం లేదని బోర్డు అభిప్రాయపడింది. Read Also: అత్యాచారం కేసులో చిక్కుకున్న…
పాకిస్థాన్ క్రికెటర్ల రాసలీలలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. గతంలో షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది, బాబర్ ఆజంపై రాసలీలల ఆరోపణలు వెలుగు చూడగా… తాజాగా పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ యాసిర్ షా అత్యాచారం కేసులో చిక్కుకోవడం సంచలనంగా మారింది. యాసిర్ షా, అతడి స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక చేసిన ఆరోపణలు చేసింది. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవాలని యాసిర్ షా తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు బాధితురాలు పేర్కొంది. ఈ…
టీమిండియాలో ప్రస్తుతం కెప్టెన్సీ రగడ నడుస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోగా.. ఈ మధ్య అతడిని వన్డే సారథిగానూ తప్పిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు గంటన్నర ముందే చెప్పారని కోహ్లీ చెప్పడం అతడి అభిమానులను తెగ బాధించింది. కోహ్లీ-గంగూలీ చెప్పిన విషయాలు వేర్వేరుగా ఉండటం క్రికెట్ అభిమానుల్ని గందరగోళానికి గురిచేసింది. Read Also: విరాట్ కోహ్లీకి ద్రావిడ్ స్పెషల్ క్లాస్ 2014లో…