స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంతా సులభం కాదని, ప్రస్తుతం తమ జట్టుకు ఆ సత్తా ఉందని వెస్టీండిస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ అన్నారు. ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడినా ఇంగ్లాండ్ పై తమ జట్టు అద్భుత విజయం సాధించి మళ్లీ ఫామ్‌లో కి వచ్చిందన్నారు. టీం ఇండియాతో 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు కీరన్ పొలార్డ్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు నేడు భారత్‌కు రానుంది. ఈ నెల 6న తొలి వన్డే జరగనుంది. కాగా ఇప్పుడు హోల్డర్ వ్యాఖ్యలు సంచలంనంగా మారాయి. దీనిపై టీం ఇండియా ఆటగాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా హోల్డర్ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టు తరపున ఆడాడు. మరో వైపు వెస్టీండీస్ ఈ సీరీస్‌కు సన్నద్ధమైంది. కాగా ఈసారి టీంఇండియా కొత్త సారథి కెప్టెన్ రోహితశర్మ ఆధ్వర్యంలో ఈ సీరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీం ఇండియా వెస్టీండీస్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.