జోహన్నెస్ బర్గ్ టెస్టులో టీమిండియా ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఈ ఓటమికి భారత్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కారణమని ఆరోపించాడు. రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం వల్లే.. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ పరుగులు రాబట్టాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సాధారణంగా బంతిని హుక్ చేయని ఎల్గార్‌కు.. రాహుల్ డీప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడంలో అర్థమే లేదన్నాడు. దీంతో డీన్ ఎల్గార్ సులభంగా సింగిల్స్ తీసుకుంటూ క్రీజులో పాతుకుపోయాడని.. మ్యాచ్ గెలిపించాడని సన్నీ…
టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి విజయవంతమైన సారథిగా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టం. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ధోనీ ఆటను, క్యారెక్టర్‌ను ఇష్టపడుతుంటారు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ కూడా ఉన్నాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ధోనీ అంటే ఎంతో అభిమానం. ఇటీవల దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో మ్యాచ్ ముగిశాక రౌఫ్ ప్రత్యేకంగా…
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈనెల 16న వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధన ఆసక్తి రేపుతోంది. ఇక నుంచి బౌలింగ్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే మైదానంలో 30 గజాల సర్కిల్ బయట ఉండే ఫీల్డర్లలో ఒకరిని తగ్గించాల్సి ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. స్లో ఓవర్ రేటుకు పడే జరిమానాకు ఇది అదనం…
కొత్త ఏడాదిని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. జోహన్నెస్ బర్గ్ టెస్టులో గెలిచి తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ సాధిస్తుందన్న అభిమానుల ఆశలను టీమిండియా తలకిందులు చేసింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టు… రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 300 పరుగులు చేయకపోవడం నిరాశ కలిగించే విషయమే. దీంతో తొలిసారిగా వాండరర్స్ స్టేడియంలో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఈ టెస్టు ముందు వరకు వాండరర్స్ స్టేడియంలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.…
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్డికాక్తండ్రి అయ్యాడు. అతడి భార్య సాషా గురువారం ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు డికాక్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమార్తెకు కియారా అనే పేరు పెట్టినట్లు డికాక్ వెల్లడించాడు. ఈ మేరకు భార్య సాషా, కుమార్తె కియారాతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Read Also: వాండరర్స్ టెస్ట్: భారత్‌పై సౌతాఫ్రికా ఘనవిజయం కాగా ఇటీవల టెస్టు క్రికెట్‌కు డికాక్ వీడ్కోలు పలికాడు. సొంతగడ్డపై టీమిండియాతో జరుగుతున్న టెస్టు…
జోహన్నెస్ బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ప్రారంభం కాలేదు. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో పిచ్ మొత్తాన్ని అంపైర్లు కవర్లతో కప్పి ఉంచారు. ఇరుజట్లకు నాలుగోరోజు కీలకంగా మారింది. భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు తీయాల్సి ఉండగా… దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 122 పరుగులు చేయాల్సి ఉంది. Read Also: 30 ఏళ్లకే క్రికెటర్ రిటైర్మెంట్.. బోర్డు నిర్ణయమే కారణమా?…
శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ ద్వారా తెలియజేశాడు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల వల్ల తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. శ్రీలంక బోర్డు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. Read Also: కోహ్లీ వందో టెస్టుపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే శ్రీలంక బోర్డు కొత్తగా ప్రవేశపెట్టిన ఫిట్నెస్ మార్గదర్శకాల…
టీమిండియా టెస్ట్ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ త్వరలోనే అరుదైన మైలురాయిని చేరబోతున్నాడు. టెస్టు కెరీర్లో అతడు వందో టెస్టును ఆడనున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో మూడో టెస్ట్ ఆడితే 99వ టెస్టు ఆడనున్న కోహ్లీ… సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే సిరీస్‌లో 100వ టెస్టు మజిలీకి చేరుకోనున్నాడు. ఆ టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతోంది. సుదీర్ఘ కాలంలో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సేవలు అందిస్తున్న కోహ్లీ… తన వందో టెస్టును బెంగళూరులో…
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించింది. విదేశాల్లో తొలిసారిగా టెస్టుల్లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. Read Also: సామాన్యుడిపై మరో భారం… పెరిగిన సిమెంట్ ధరలు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 328 పరుగులు చేయగా.. కివీస్ బౌలర్లను…
భారత క్రికెట్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఏడు పరుగులు చేస్తే జోహన్నెస్ బర్గ్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా నిలవనున్నాడు. Read Also: క్రిస్ గేల్‌కు షాకిచ్చిన వెస్టిండీస్ బోర్డు రెండో టెస్టుకు ఆతిథ్యం ఇవ్వబోతున్న జొహనెస్‌బర్గ్ వేదికలో విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది.…