అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన యువరాజ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య హేజల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు యువరాజ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను అభిమానులందరూ గౌరవించాలని యువరాజ్ విజ్ఞప్తి చేశాడు.
Read Also: టీమిండియాకు ఐసీసీ భారీ జరిమానా.. ఎందుకంటే?
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు యువరాజ్-హేజల్ దంపతులను అభినందనలతో ముంచెత్తుతున్నారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా యువరాజ్‌ను అభినందించాడు. ‘అభినందనలు సోదరా. నువ్వో గొప్ప తండ్రివి అవుతావు. చిన్నారిపై బోల్డంత ప్రేమ కురిపిస్తావు’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. కాగా యువరాజ్ సింగ్ పోస్టునే యథాతథంగా హేజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. యువరాజ్-హేజల్ కీచ్ దంపతులు 2016, నవంబర్ 30న వివాహం చేసుకున్నారు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో యువరాజ్ హీరోగా నిలిచాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన ఘనత కూడా యువీ పేరిటే ఉంది.
❤️ @hazelkeech pic.twitter.com/IK6BnOgfBe
— Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2022
తాజావార్తలు
-
El Nino: ఎల్నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!