టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడి నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ రికార్డు అందుకున్నాడు. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. విదేశాల్లో సచిన్ వన్డేల్లో 5,065 పరుగులు చేయగా… విరాట్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.…
వెస్టిండీస్‌లో అండర్-19 ప్రపంచకప్ కోసం పర్యటిస్తున్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కరోనా బారిన పడ్డారు. వీరితో క్లోజ్ కాంటాక్టులో ఉన్న బౌలర్ ఆరాధ్య యాదవ్‌తో పాటు వసు వత్స్, మానవ్ ప్రకాశ్, సిద్ధార్థ్ యాదవ్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరంతా వరల్డ్ కప్ నుంచి వారు నిష్ర్కమించారు. ఐదుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ప్రస్తుతం భారతజట్టుకు 11…
దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య వన్డే సిరీస్‌కు తెర లేచింది. పార్ల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ వన్డే సిరీస్‌లో టీమిండియాకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకున్న తర్వాత తొలిసారిగా ఈ వన్డే సిరీస్‌లో ఓ సాధారణ ఆటగాడిగా కోహ్లీ ఆడబోతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు తొలి వన్డే, ఈనెల 21న రెండో వన్డే, 23న మూడో వన్డే జరగనున్నాయి.…
టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ మరో 26 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. Read Also: ఐపీఎల్: అహ్మదాబాద్ కెప్టెన్‌గా…
ఐపీఎల్ 2022లో కొత్తగా రెండు జట్లు రంగప్రవేశం చేయనున్నాయి. వాటిలో ఒకటి అహ్మదాబాద్ జట్టు కాగా మరొకటి లక్నో జట్టు. ఈ రెండు జట్లు ఈనెల 22లోపు తమ జట్టులో ఉండే ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ఐపీఎల్ పాలకమండలికి నివేదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ జట్టులో హార్డిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్ ఆడతారని అహ్మదాబాద్ జట్టు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇంకా ఐపీఎల్ మెగా వేలం జరగలేదు. కానీ ముందస్తుగా ఆయా…
ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ ఓటమి ఇంగ్లండ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు టెస్టులకు కాకుండా టీ20లకు ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరం కావాలని పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ మెగా వేలానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేయాలని అతడు భావించినా యాషెస్ సిరీస్ ఓటమి కారణంగా తన జాతీయ జట్టుకు…
ఐర్లాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ గడ్డపై ఆశ్చర్యకర రీతిలో వన్డే సిరీస్ విజయాన్ని సాధించింది. సబీనా పార్కులో ఆదివారం రాత్రి జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌పై రెండు వికెట్ల తేడాతో ఐర్లాండ్ గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో వెస్టిండీస్ గెలవగా… రెండు, మూడు వన్డేల్లో ఐర్లాండ్ గెలిచి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా విదేశీ గడ్డపై తొలిసారి ఐర్లాండ్ వన్డే సిరీస్ గెలిచింది. Read Also: ఐపీఎల్ 2022:…
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది చెన్నై సూపర్‌కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీనే. అతడి సారథ్యంలో చెన్నై జట్టు అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. నాలుగు సార్లు ట్రోఫీని కూడా గెలుచుకుంది. అయితే వచ్చే ఐపీఎల్లో ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టును నడిపించనున్నాడని సమాచారం.…
సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. నామమాత్రంగా మిగిలిన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌పై 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. హోబర్ట్ వేదికగా జరిగిన చివరి టెస్టులో 271 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను 124 పరుగులకే ఆసీస్ బౌలర్లు ఆలౌట్ చేశారు. లక్ష్యఛేదనలో ఓ దశలో ఇంగ్లండ్ 68/0తో పటిష్టంగా కనిపించింది. అయితే 56 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి మరో పరాజయం మూటగట్టుకుంది.…
భారత క్రికెట్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శకం ముగిసింది. గత ఏడాది టీ20లు, వన్డేలకు సంబంధించి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్టులకు కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇది అనూహ్య నిర్ణయం. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అయితే కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ‘ఇది పూర్తిగా విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బీసీసీఐ ఎంతో గౌరవిస్తుంది. విరాట్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో భారత…