భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మంత్రి పదవి ఊడిపోయింది.. కేరళ మత్స్యకార, సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్.. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.. చెరియన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు.. అతడిని కేబినెట్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశాయి.. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.. ఇక, మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం పినరయి…
రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లకాడు చేస్తుంది.. ప్రజా ఉద్యమాలకు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు సీపీఎం నేత పి. మధు
కేరళలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం అల్లర్లకు కారణం అయ్యారు. ఏకంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయాన్ని శుక్రవారం ధ్వసం చేశారు. కేరళలోని కొండ ప్రాంతాల్లోని అడవుల చుట్టూ బఫర్ జోన్ల వల్ల కలిగే ఇబ్బందులపై రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవడంలో విఫలం అయ్యారని ఆరోపిస్తూ తీవ్ర ఆందోళనలకు తెరతీసింది వామపక్ష విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ. ఆందోళనల్లో భాగంగా వయనాడ్ లోని రాహుల్ గాంధీ ఆఫీస్ పై పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. దాడికి…
బీజేపీ నేత డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతోందని ఆమె అన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను కేసీఆర్ తుంగలో తొక్కి మరోసారి ఎన్నికల్లో ప్రజలను మోసగించేందికు సిద్దమవుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా,సంక్షేమ పథకాలను ప్రజలకు కార్యకర్తలు విధిగా తెలియజేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడంతో పేదలు వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారని…
తెలంగాణలో కామ్రేడ్లు సైలెంట్ అయ్యారు. సమస్యలున్నా కనిపించడం లేదు. ఒకప్పుడు విద్యుత్ పోరాటంలో కాల్పుల వరకు లెఫ్ట్ పార్టీల ఉద్యమం ఎగిసిపడింది. అలాంటి వామపక్ష నేతలకు ఏమైంది అన్నదే ప్రస్తుతం ప్రశ్న. నిత్యావసరాల ధరాలు భారీగా పెరిగాయి. పెట్రోధరలు భగ్గుమంటున్నాయి. ఆర్టీసీలో ఛార్జీల మోత మోగుతోంది. విద్యుత్ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎర్ర జెండాలతో రోడ్డెక్కి ధర్నాలు.. రాస్తారోకోలు.. ప్రభుత్వ ఆఫీసుల ముట్టడితో హోరెత్తించేవి.. CPI, CPM ఇతర వామపక్ష పార్టీలు.…
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండ , వరంగల్ జిల్లాలలో జరుగుతున్న భూ పోరాటాల కేంద్రాలను సందర్శించేందుకు వెళ్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్ లను వరంగల్ జిల్లా రాయపర్తిలో పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ వద్ద సీపీఎం(CPM) ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సీపీఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మహిళలు ఎర్రటిఎండలో రోడ్డుపై బైఠాయించారు. కాగా…
ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… కేంద్ర ప్రభుత్వ బుల్డోజర్ డ్రైవ్‌ను నిరసిస్తూ ఆందోళనకారులు నిరసన చేపట్టారు. అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో నరేంద్ర మోడీ సర్కార్ ఈ ప్రాంతంలోని ముస్లింల నివాసాల కూల్చివేతను ప్రారంభించిందని మండిపడుతున్నారు.. మరోవైపు.. షాహీన్‌బాగ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. కోర్టును ఆశ్రయించినవారిలో బాధితులు లేరని సుప్రీం పేర్కొంది.. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీ పిటిషన్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. షాహీన్‌బాగ్‌లో ఆక్రమణల…
పశ్చిమ బెంగాల్‌లో మరోసారి హింస జరిగింది.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది.. దీనిపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.. ఇక, ఇప్పుడు బీర్‌భూం జిల్లా రామ్‌పుర్ హాట్ రాజకీయ హింసపై, అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై ఇద్దరు చిన్నారులతో పాటు ఎనిమిది మంది సజీవ దహనం కావడం విషాదం నింపింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన…
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆకస్మిక మరణం పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మల్లు స్వరాజ్యం మరణంతో ఆసుపత్రికి చేరుకున్నారు సీపీఎం నేత, మాజీ ఎంపీ మధు. ఆమె మరణానికి తీవ్ర సంతాపం తెలిపారు. స్వరాజ్యం మరణం తీరని లోటు. భూస్వామ్యక కుటుంబంలో పుట్టిన పోరాట యోధురాలుగానే ఆమె నడిచింది. ఆమె జీవితం ప్రజల కోసం అర్పించింది అన్నారు మధు. మల్లు స్వరాజ్యం ఆకస్మిక మృతికి సంతాపం తెలిపారు ఏపీ సీఎం జగన్మోహన్…