కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ వాళ్లు ప్రధానిపై అవాకులు, చవాకులు పేలుతున్నారని బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో మీ శక్తి ఎంతని, సీపీఐకి దేశం లో ఓ ఎంపీ ఉన్నాడని ఆయన అన్నారు. సీపీఎం శక్తి ఎంత… కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయిందని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు రాష్ట్రంలో తోక పార్టీలుగా మిగిలాయని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయాలు మూసివేశారని, ప్రధానిని విమర్శించే ముందు…
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఎక గ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ పదవిని చేపట్టడం తమ్మినేని వీరభద్రానికి ఇది మూడో సారి. కాగా.. 60 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నికను కూడా పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాల్ ఆదివారం నుంచి సీపీఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ 3 వ మహాసభలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీర భద్రం మరోసారి ఏక గ్రీవంగా ఎన్నిక అయ్యారు.…
సీపీఎం జాతీయ సమావేశాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను విమర్శించారు. రాజకీయ విధానం పార్టీకీ ముఖ్యమని, కానీ రాజకీయ విధానం ఎప్పుడు ఒకేలా ఉండదన్నారు. పరిస్థితికి అనుగుణంగా మారుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆచరణ సాధ్యం కానీ మార్గాలను ఎంచుకున్నారని, కాళేశ్వరం ఒక్కటే తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చదన్నారు. ఆంధ్రా వాళ్ళ వల్లనే మనకు ఉద్యోగాలు రావడం లేదని కేసీఆర్ చెప్పారన్నారు. దళితులకు మూడెకరాలు…
సీపీఎం జాతీయ సమావేశాల్లో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీని విమర్శించారు. ఏడున్నర ఏళ్లలో బీజేపీ కార్పొరేట్ సంస్థలకు పెద్ద పీట వేసిందన్నారు. ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సేవకులు కనుమరుగు అవుతున్నారన్నారు. ప్రజాధనం లూటీ చేసే వాళ్లే రాజ్యం ఏలుతున్నారన్నారు. వామపక్షాలు బలహీన పడ్డాయి..అందుకే దేశంలో అరాచకం పెరిగిందని చాడా వ్యాఖ్యానించారు. సీపీఐ, సీపీఎం భావసారుప్యత ఉన్న పార్టీలని చాడ అన్నారు. వామపక్షాల ఐక్యతే కాదు..…
హైద్రాబాద్‌లో జరుగుతున్న సీపీఐ జాతీయ సమావేశాల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉంటే ఆర్‌ఎస్‌ఎస్ విధానాలనే అమలు చేస్తుందన్నారు. 2019లో అధికారంలోకి రాగానే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. ప్రజా ఉద్యమాలతోనే కేంద్రం దిగి వస్తోందని ఏచూరి అన్నారు. Read Also: దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకున్న ఒమిక్రాన్ రైతాంగ పోరాటం మొదటి సారిమోడీని లొంగదీసిందన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలు కూడా పూర్తిగా దిగజారాయని…
రేపటి నుండి సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, టీఆర్‌ఎస్‌ను తీవ్రంగా విమర్శించారు. దేశానికి బీజేపీ.. తెలంగాణకు టీఆర్‌ఎస్ ప్రమాదకరమన్నారు.బీజేపీ…టీఆర్‌ఎస్ రెండు పార్టీలు మాకు సమానమేనన్నారు. ఈ మధ్య కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం స్వాగతించదగిన అంశం అని ఆయన పేర్కొన్నారు. Read Also: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో…
తెలంగాణ రాజకీయాల్లో ఆ రెండు పార్టీలు డిఫరెంట్. ఎప్పుడు ఏ జెండా కిందకు వెళ్తాయో.. ఎలాంటి అజెండాను ఎత్తుకుంటాయో ఎవరికీ అర్థం కాదు. ప్రస్తుతం కొత్త దోస్తీకి కసరత్తు చేస్తున్నట్టు టాక్. ఇంతకీ ఏంటా పార్టీలు? టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయడానికి ఉన్న అభ్యంతరాలేంటి?తెలంగాణలో రాజకీయం కాక మీద ఉంది. రెండు, మూడు నెలలుగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తలనొప్పే అని డిసైడ్ అయినట్టు ఉంది టీఆర్ఎస్. కొత్తగా…
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోంది అంటూ మండిపడ్డారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. యూపీలో మంత్రిగా ఉండి రాజీనామా చేసిన మౌర్య పై ఏడేళ్ల క్రితం పెట్టిన కేసులు బీజేపీ బయటకు తీసి వేధిస్తోందని.. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఫైర్ అయ్యారు. ఇక, ధరల నియంత్రణలో బీజేపీ ఘోరంగా విఫలం అయ్యిందని విమర్శించిన రాఘవులు.. ఎరువుల ధరలు నియంత్రణ పై…
అన్ని రంగాల్లో ప్రధాని మోడీ విఫలమయ్యారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటితో ముగియనున్న సమావేశాలు. ఈ సమావేశాల్లో 23 రాజకీయ తీర్మానాలను ఆమోదించిన కేంద్ర కమిటీ. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు కన్నూర్‌లో పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్ర కార్యవర్గం నిర్ణయించింది. అనంతరం సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని మోడీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.…
సీపీఐ, సీపీఎం పార్టీల జాతీయ అగ్రనాయకత్వం శనివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగునున్న కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సీపీఎం పార్టీ జాతీయ నేతలు హైద్రాబాద్ కు రాగా… సీపీఐ పార్టీ అనుబంధ అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు సీపీఐ నేతలు వచ్చారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రగతి భవన్ కు విడి విడిగా వచ్చిన ఉభయ కమ్యునిస్టు పార్టీల…