జాతీయ స్థాయిలో విపక్షాలు కేంద్రంపై పోరాడుతూనే ఉన్నాయి.. కానీ, కొన్ని ప్రతిపక్షాలకు.. బీజేపీకి పెద్దగా తేడా లేదన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేసి.. ఏపీలోని వైసీపీ, టీడీపీలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతిచ్చాయని దుయ్యబట్టారు.. ప్రత్యేక హోదా, విభజన హామీలు సహా చాలా సమస్యలను కేంద్రం పరిష్కరించాల్సి ఉందని గుర్తుచేసిన ఆయన.. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని వివిధ సందర్భాల్లో వైసీపీ-టీడీపీ కామెంట్లు చేశాయి.. అయినా, ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రజలపై భారాలు మోపితే కేంద్రం అప్పులు ఇస్తామంటోంది.. దానికి వైసీపీ వంత పాడుతోన్న పరిస్థితి ఉందన్నారు.. కేంద్రం చేసే తప్పిదాలపై వైసీపీ పోరాడకుండా.. బీజేపీ చల్లని నీడ ఉంటే చాలని భావిస్తోందని విమర్శించారు రాఘవులు.
Read Also: Cheating: వీడు మామూలోడు కాదు.. 11 మందితో పెళ్లి.. కొండాపూర్‌లోనే ఏడు..
ఇక, పోలవరం నిర్వాసితులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీవీ రాఘవులు.. పోలవరం గిరిజనులను ఆదుకోవాలని కోరారు.. గతంలో కూడా కేంద్రం వివిధ సందర్భాల్లో నిఘా, దర్యాప్తు సంస్థలను వినియోగించేవి.. కానీ, నరేంద్ర మోడీ సర్కార్ వాటిని మరింత ఎక్కువగా వినియోగిస్తోందని ఆరోపించారు.. మహారాష్ట్ర తరహా సంఘటనలను సృష్టిస్తోందన్న ఆయన.. కానీ, బీజేపీని ఎదుర్కొనే విషయంలో విపక్షాల మధ్య కొంత గ్యాప్ ఉన్న మాట వాస్తవమే అన్నారు. మరోవైపు, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారంపై స్పందించిన రాఘవులు.. స్పీకర్ పదవిలో ఉన్న వాళ్లు పార్టీలకు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు.. చట్టంలో అలాంటి నిబంధన లేదన్నారు.. స్పీకర్ పదవి చేపట్టినా.. పార్టీ సమావేశాలకు హాజరు కావచ్చు.. పార్టీ వేదికలను పంచుకోవచ్చు.. కానీ, స్పీకర్ చైర్‌లో కూర్చోన్న తర్వాత అన్ని పార్టీలను సమానంగా చూడాలని సూచించారు బీవీ రాఘవులు.