ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు సీటు చుట్టూ రాజకీయ చర్చ నడుస్తోంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి MLAగా గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి.. టీఆర్ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై తానే పోటీ చేస్తానని గట్టి ధీమాతో ఉన్నారు. కానీ.. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య కుదిరిన దోస్తీ.. పొత్తుల దిశగా అడుగులు వేస్తుండటంతో సీన్ మారిపోతోందన్నది తాజా టాక్. పొత్తు పొడుపుల్లో కుదిరే సర్దుబాటుల్లో పాలేరు చేరుతుందని.. ఆ…
తెలంగాణ గవర్నర్ తమిళి సై తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పడం అంటే వివాదం తెచ్చుకునే ఆలోచనలో ఉందని మండిపడ్డారు.
Kerala "Human Sacrifice" Accused Not CPM Members, Says Party:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ ఇద్దరు మహిళల దారుణహత్య, నరబలి కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలు నిందితులు అధికార సీపీఎం పార్టీకి చెందిన వారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. నరబలి కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిలో ఇద్దరు సీపీఎం పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Congress MLA physically assaulted a woman: కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచార కేసు నమోదు అయింది. ఒక మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్డోస్ కున్నప్పిల్లి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపిస్తోంది. అయితే ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి సదురు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. పెరంబవూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు సంబంధించిన రెండు సెల్ ఫోన్లు స్విచ్ఛాప్ లో ఉన్నాయని.. అతన్ని ఇప్పటి వరకు…
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది… అయితే, ఈ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి… కమ్యూనిస్టులకు చెప్పుకోదగిన ఓటింగ్ ఉండడంతో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వారితో పొత్తుకోసం ప్రయత్నాలు చేశాయి.. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే.. టీఆర్ఎస్‌కే సాధ్యం.. అందుకే.. తమ మద్దతు.. గులాబీ పార్టీకేనని ప్రకటించాయి సీపీఎం, సీపీఐ.. అయితే, మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక విషయంలో చేసిన కామెంట్లను…
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి… రంగారెడ్డి జిల్లా మాడ్గులలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.. సీతారాం ఏచూరితో పాటు.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంపీ రాములు,…
BV Raghavulu: దేశ రక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం సీపీఎం దేశ రక్షణ భేరి నిర్వహిస్తోంది. విజయనగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపడుతోందని.. ఎందరో మంది వీరుల త్యాగ ఫలమే స్వాతంత్య్రం అని బీజేపీ గుర్తించాలని బీవీ రాఘవులు సూచించారు. ఏనాడూ స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ లేదా వారి…