ఒకప్పుడు బర్డ్ ఫ్లూ పేరు చెప్పగానే జనం హడలిపోయారు. దేశంలో చికెక్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. దేశంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బీహార్ లో వరుసగా పక్షులు చనిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేస్తుంటే.. వ్యాపారులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. దీంతో బీహార్ లో చికెన్ తినకుండా చూడాలని జిల్లా అధికారులు ప్రజలను ఆదేశించారు. మళ్లీ తమకు గడ్డురోజులు వచ్చినట్టేనని వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. గత కొన్నాళ్ళుగా బీహార్‌లోని సుపాల్ జిల్లాలో వరుసగా పక్షులు…
కరోనాకు పుట్టినిలైన చైనాను మహమ్మారి మరోసారి కుదిపేస్తోంది. షాంఘైలో కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ఆకలి కేకలతో చైనా అల్లాడిపోతోంది. కరోనా కఠిన లాక్‌డౌన్‌తో జనం అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి దొరకడం లేదని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిత్యం 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం గరిష్ఠంగా ఒక్కరోజే 25 వేల కేసులు రికార్డయ్యాయి. మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి…
తమిళనాడులో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా 3,086 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరోవైపు.. కోవిడ్ ఆంక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కార్.. ఈ నెల 16 నుంచి మరిన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయన్నారు.. అయితే లాక్‌డౌన్ నిబంధనలను మాత్రం మార్చి 2వ తేదీ వరకు కొనసాగనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తమిళనాడు ఇప్పుడు కిండర్ గార్టెన్ మరియు ప్లే స్కూల్‌లను తిరిగి తెరవడానికి అనుమతించింది. కొత్త నిబంధనలలో భాగంగా ప్రదర్శనలు…
తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో దర్శించుకునే మేడారం జాతరకు మళ్ళీ రంగం సిద్ధమయింది. ఫిబ్రవరిలో 16 నుండి19 వరకు జరిగే జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఐ జి నాగిరెడ్డి పలు సూచనలు చేశారు. వీఐపీల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పదివేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మేడారం పరిసర ప్రాంతాలన్ని పరిశీలించడానికి 380 వరకు cc కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.జాతరలో ప్రతీ కదలికలను పరిశీలించడానికి కమాండ్…
కరోనా నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై సీఎం జగన్‌కు దూరదృష్టి లేదన్నారు. కరోనా థర్డ్ వేవ్ అందోళనకరంగా ఉంది.విద్యా సంస్థలను కనీసం ఈ నెలాఖరు వరకూ మూసివేస్తేనే విద్యార్థులను ఈ వైరస్ బారి నుంచి కాపాడుకోగలం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాత్రం- కేసులు పెరిగితే చూద్దాం అని చెప్పడం బాధ్యతారాహిత్యం. విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత…
తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని కలిశారు నటుడు, ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను నందమూరి బాలకృష్ణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి వివరించారు. అంతే గాకుండా హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి…
ప్రస్తుతం కోవిడ్ అనే పేరు వింటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. 2020 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తిట్టుకునే పేర్లలో కచ్చితంగా కోవిడ్ ఉండి తీరుతుంది. కానీ కోవిడ్ అనే పేరు మనుషులకు ఉంటుందని మనం ఊహించగలమా? అయితే మన ఇండియాలో కోవిడ్ అనే పేరు గల మనిషి ఉన్నాడండోయ్. అతడి పూర్తి పేరు కోవిడ్ కపూర్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబై ఐఐటీలో చదువుకున్న కోవిడ్ కపూర్ ప్రస్తుతం బెంగళూరులోని ట్రావెల్ కంపెనీ హాలిడిఫై.కామ్ సహ…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. తాజా బులెటిన్ ప్రకారం.. 1.14 లక్షలకు పైగా కేసులు ఒకేరోజు నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది.. తెలంగాణలోనూ కోవిడ్ మీటర్ పైకి దూసుకుపోతోంది.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు.. కోవిడ్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు.. కరోనా తీవ్రతపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.. కరోనా తీవ్రత దృష్ట్యా అన్ని రాష్ట్రాల హైకోర్టులు కోవిడ్ నియంత్రణ చర్యలపై మానిటరింగ్…
ఒకవైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే 1700 కేసులు దాటిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఒమిక్రాన్ మహమ్మారి. తీవ్రత తక్కువగానే వున్నా జనం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా వుంటే.. దేశంలో వారం రోజుల్లో 5 రెట్లు పెరిగాయి కోవిడ్ కేసులు. గోవా వీధుల్లో బాగా బీచ్ సమీపంలో తీసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు కోవిడ్ వీరవిహారం చేస్తున్న వేళ వేలాదిమంది న్యూ ఇయర్ వేడుకల్లో…
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? వస్తే పార్టీలన్నీ రెడీగా వున్నాయా? అంటే అవుననే అంటున్నాయి. తాజాగా ఏపీలో టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబునాయుడు దీనిపై మనసులో మాట బయటపెట్టారు. మీడియాతో చిట్ చాట్ చేశారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నా అన్నారు. అనేక మంది సీఎంలు పని చేసినా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సీఎం ఎవ్వరూ లేరు.రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీశారు. పారిశ్రామిక…