సీఎం జగన్‌కు దూరదృష్టి కరువు -నాదెండ్ల మనోహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై సీఎం జగన్‌కు దూరదృష్టి లేదన్నారు. కరోనా థర్డ్ వేవ్ అందోళనకరంగా ఉంది.విద్యా సంస్థలను కనీసం ఈ నెలాఖరు వరకూ మూసివేస్తేనే విద్యార్థులను ఈ వైరస్ బారి నుంచి కాపాడుకోగలం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాత్రం- కేసులు పెరిగితే చూద్దాం అని చెప్పడం బాధ్యతారాహిత్యం.
విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత లేదనే విషయం అర్థమవుతోంది. దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే విద్యా సంస్థలను మూసివేసి ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహణపై మార్గదర్శకాలు ఇచ్చాయి.ఆ మాత్రం దూరదృష్టి కూడా సీఎంకు లేకపోయిందని ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. రోజుకి 4 వేలకుపైగా కొత్త కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి.
Also Read
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రోజువారీ పాజిటివిటీ రేట్ 16.28శాతం నుంచి 19.65 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయాన్ని విస్మరించవద్దు.ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను స్కూల్స్, కాలేజీలకు పంపించడం రిస్క్ అవుతుంది.ఏపీ విద్యాశాఖ మంత్రి- వ్యాక్సిన్లు ఇస్తున్నాం కాబట్టి స్కూల్స్ తెరుస్తాం అంటున్నారు.15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ మన రాష్ట్రం కంటే మహారాష్ట్రలో ఎక్కువ మందికి వేశారు.. అక్కడే విద్యా సంస్థలను మూసివేశారు.
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోనూ వ్యాక్సిన్ అందిస్తున్నారు.. ఆయా రాష్ట్రాలు విద్యార్థుల క్షేమం కోసం సెలవులు పొడిగించాయి.ఎన్నో జాగ్రత్తలు తీసుకొనే వైద్య కళాశాలల్లోని విద్యార్థులే కోవిడ్ బారినపడుతున్నారు.మరి స్కూల్ పిల్లల పరిస్థితి ఏమిటి? ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో భౌతిక దూరం అమలు చేయడం లేదు. పాఠశాలల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచడం లేదు. అలాంటప్పుడు స్కూల్స్ తెరవడం సమంజసమా?అని మనోహర్ ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు విద్యా సంస్థలు తెరవాలి. పరీక్షలు నిర్వహించాలనే మొండి ధోరణిని విడిచిపెట్టి విద్యార్థుల సంరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..