Covid-19 Cases: భారతదేశంలో కోవిడ్-19 కేసులు చాప కింద నీరులా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 6000 మార్కును దాటింది. ఆదివారం విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత 48 గంటల్లో 769 కొత్త ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి, భారతదేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 6,000 మార్కును దాటినట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6133.
Covid-19: ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 ఒక వ్యక్తిలో రెండేళ్ల పాటు ఉండి, కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందిన ఓ కేస్ స్టడీని ఆమ్‌స్టర్‌డామ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ నివేదించింది.
కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నా, అప్పటి గాయాలు చాలా మందిని ఇంకా వెంటాడుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. కొవిడ్ వచ్చినప్పుడు చాలా మంది బతకాలనే ఆశతో ఆస్తులను అమ్మి వైద్యం చేయించుకున్నారని, కానీ ఆర్థికంగా అన్నీ కోల్పోయి ఇంకా ఎందుకు బతికున్నామా అని ఇప్పుడు కుమిలిపోతున్నారని ఆయన అన్నారు.
Ashok Gehlot: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కోవిడ్-19, స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. జ్వరం, తక్కువ ఆక్సిజన్ సాచురేషన్ స్థాయిలు ఉండటంతో జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అచల్ శర్మ శనివారం చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులతో పరీక్షల(పరీక్షా పే చర్చ 2024) గురించి చర్చించారు. పరీక్షల టెన్షన్‌ను తొలగించేందుకు విద్యార్థులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషించారు. ప్రధాన మంత్రి అనేక ఉదాహరణలు ఇవ్వడం ద్వారా పిల్లలను ప్రేరేపించారు. ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
Covid-19 : భారత్‌లో మరోసారి కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. బుధవారం (డిసెంబర్ 27) భారతదేశంలో ఒకే రోజులో 529 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Warangal Corona: వరంగల్‌లో కరోనా మరియు ఓమిక్రాన్‌ను ఎదుర్కొంటున్నప్పుడు, కొత్త వేరియంట్ నేపథ్యంలో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు. ఈ మేరకు వరంగల్ ఎంజీఎంలో ప్రత్యేక వైద్యుల బృందాన్ని కూడా నియమించారు.
Venky Kudumula: టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన కజిన్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కోవిడ్ తరువాత వచ్చే జ్వరాన్ని నార్మల్ గా తీసుకోవద్దని ఆయన వేడుకున్నాడు.
KTR : ఐటీ రంగానికి సంబంధించి తెలంగాణ నేడు దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీస్ హైదరాబాద్‌లో కాంపిటెన్స్ సెంటర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు.
China : ఒకప్పుడు చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లు అందరినీ ఆకట్టుకునేవి. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చైనా స్మార్ట్‌ఫోన్లు బడా కంపెనీలను కూడా భయపెట్టాయి. అనేక సంబర్భాల్లో చైనీస్ కంపెనీ Xiaomi కంటే ఆపిల్, శామ్సంగ్ కంపెనీలు వెనుకబడి పోయాయి.