నల్గొండ పట్టణంలో లాక్‌డౌన్ పేరుతో ఈ రోజు ఉదయం పోలీసులు అత్యుత్సాహం లాఠీఛార్జీ చేయడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. లాక్‌డౌన్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే ఉ. 09.40 గం.లకే సామాన్య ప్రజలపై విరుచుకుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలతో పాటు తమ ప్రాణాలకు తెగించి కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందజేస్తున్న విద్యుత్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులపై సైతం లాఠీలతో దాడులకు పాల్పడడంపై మండిపడ్డారు.…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా జమ్మూ కాశ్మీర్ లో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 24తో కరోనా నియంత్రణలు ముగియనుండటంతో మహమ్మారి కట్టడికి కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూను మే 31 వరకూ పొడిగించినట్టు జమ్ము కశ్మీర్ అధికార యంత్రాంగం శనివారం వెల్లడించింది. కర్ఫ్యూ నుంచి నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.
దేశమంతటా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే మహారాష్ట్ర, ముంబైలో మాత్రం మరింత దారుణంగా పరిస్థితి ఉంది. అందుకే, ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్వరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రచారం చేస్తోంది. తాజాగా అభిషేక్ బచ్చన్ నటించిన సినిమాల పేర్లు ఎంచుకుని వాటితో వెరైటీగా ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ మెసేజ్ ని ఇచ్చారు! దానికి అభిషేక్ బచ్చన్ స్పందించటం నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది!ఇంతకీ, ముంబై పోలీస్ సోషల్ మీడియాలో ఏమన్నారంటే…. ‘గురు’… ముంబై లేదా ‘దిల్లీ 6’…
తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి వేవ్ లో ఉన్నంతగా సీరియస్ లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఇటీవలే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పోలీసులు ఫుడ్ డెలివరీ సంస్థలకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ వాహనాలను సైతం సీజ్ చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించారంటూ ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా వడ్డించారు. దీనిపై డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం…
కరోనా కట్టడిలోనై తన మార్క్ చూపిస్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. మాస్క్ ధరించడంపై స్వయంగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు.. ఇక, కోవిడ్ కట్టడిలో తామున్నామంటూ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు సినీ తారలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు.. తాజాగా, కోవై జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏకుంగా రూ.32 కోట్ల విరాళాలు అందజేశారు. ఈ మేరకు తమిళనాడు సచివాలయం ప్రకటన విడుదల చేసింది.. పరిశ్రమల నగరం కోయంబత్తూర్ జిల్లాలో…
2021 ప్రారంభంలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టటంతో మార్చ్ నెలకల్లా అనేక సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ అయ్యాయి. కానీ, ఏప్రెల్ నుంచీ సీన్ మారిపోయింది. సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చి పడటంతో మరోసారి బాక్సాఫీస్ మూతపడిపోయింది. థియేటర్ల గేట్లు తెరుచుకోవటం లేదు. మరి నిర్మాతల పరిస్థితి ఏంటి? 2020లో చేసిందే ఇప్పుడూ చేస్తున్నారు. ఓటీటీ వైపు సీరియస్ గా లుక్కేస్తున్నారు. లాస్ట్ ఇయర్…
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలవర పెడుతుంది. రోజుకు దాదాపు మూడు లక్షల వరకు కేసులు నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. దానికి తోడు బ్లాక్ ఫంగస్ భయపెడుతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రలతో పాటుగా దేశంలోని మరిన్ని రాష్ట్రాలలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ఫంగస్ భారత్ లో బయపడింది. బీహార్ లో కొత్తగా వైట్ ఫంగస్ సోకిన నలుగురిని గుర్తించారు అధికారులు. ఇక ఈ…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా సెలెబ్రిటీలతో సహా ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది కరోనాతో ఆసుపత్రులలో పోరాడుతున్నారు. ఈ కఠిన సమయాల్లోనే ప్రజలకు సహాయం అందించడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్ తన దాతృత్వంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. ఇంకా తన సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు తమకు తోచిన సాయం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ ఆక్సిజన్ బ్యాంక్…
కరోనా సమయంలో రెమ్‌డెసివర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది… ఈ ఇంజక్షన్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడి.. మార్కెట్లో దొరకని పరిస్థితి… దీంతో.. కేటుగాళ్లు దీనిని సొమ్ము చేసుకోవడానికి బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు.. బాధితుల అవసరాన్ని బట్టి అందినకాడికి దండుకునేపిలో పడ్డారు.. ఇప్పటికే చాలా ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు.. అయితే.. ఈ రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయన్న డబ్ల్యూహెచ్‌వో.. ఈ…