ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలవర పెడుతుంది. రోజుకు దాదాపు మూడు లక్షల వరకు కేసులు నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. దానికి తోడు బ్లాక్ ఫంగస్ భయపెడుతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రలతో పాటుగా దేశంలోని మరిన్ని రాష్ట్రాలలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ఫంగస్ భారత్ లో బయపడింది. బీహార్ లో కొత్తగా వైట్ ఫంగస్ సోకిన నలుగురిని గుర్తించారు అధికారులు. ఇక ఈ వైరస్ కూడా కరోనా లక్షణాలనే పోలి ఉంది అని చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికే ఈ కొత్త వైట్ ఫంగస్ సోకె అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు.