చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ కరోనా సెకండ్ వేవ్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఈ వైరస్ పేదవాళ్ళను కూడా వదలడం లేదు. సెకండ్ వేవ్ ముగుస్తున్న తరుణంలో థర్డ్ వేవ్ కూడా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ లో భారీగా…
తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. జిల్లాలో రోజురోజుకు కోవిడ్ కేసులు తగ్గుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గడచిన 24 గంటల్లో 1,00,677 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 436 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యల్పం. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఉద్ధృతి మరింత…
కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షలను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్… కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నట్టు ప్రకటించారు.. 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ మొత్తాన్ని వడ్డీతో సహా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక, ఆ చిన్నారులకు స్కూల్, కాలేజ్, గ్రాడ్యుయేషన్ వరకు విద్యా మరియు వసతి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్న సీఎం స్టాలిన్.. అలాంటి అనాథ…
కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత, రచయిత వెంకట్ సుభాను కరోనా బలి తీసుకుంది. మే 29న తెల్లవారుజామున 12.48 గంటలకు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దాదాపు 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది వెంకట్ సుభాకు. చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి…
కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పో్యి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారి పేర్లతో రూ.10 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, అందులో భాగంగా.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారులను ఇప్పటి వరకు 78 మందిని గుర్తించారు అధికారులు.. వారిలో ఇప్పటికే 10 మంది పేర్లపై రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేశారు.. ఇవాళ కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన…
తెలంగాణలో అమలు చేస్తున్న కఠిన లాక్‌డౌన్ నిబంధనలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సుమారు నెల రోజుల తర్వాత తెలంగాణలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఆసుపత్రిలో అరగంటకే బెడ్లు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు కోవిడ్ కు వచ్చే కాల్స్ కూడా పూర్తి మొత్తంలో తగ్గాయి. రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రోడ్లపై రాకపోకలతో…
కరోనా కష్టకాలంలో నటుడు జీవన్ కుమార్ నిర్మల్ జిల్లా గండి గోపాల్ పూర్, కట్టకింది గూడం, గండి గూడం, చెరువు కింద గూడంలో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో నివసిస్తున్న 350 గిరిజన కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, ఇతర నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు, శానిటైజర్స్ అందించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీప్రవీణ్ కుమార్, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ శ్రీధర్, కడం ఎస్ఐ రాజు, దస్తూరాబాద్ ఎస్ఐ రాహుల్, గ్రామ సర్పంచ్,…
పలు దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా జపాన్ లో మాత్రం ఫోర్త్ వేవ్ విజృంభణ మొదలైంది. ముఖ్యంగా జపాన్ ప్రధాన నగరం ఒసాకాలో కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతోంది. కేవలం 90 లక్షల జనాభా ఉన్న జపాన్‌లో ఈ ఒక్క వారంలో 3849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జపాన్‌లో సంభవిస్తోన్న కొవిడ్ మరణాలు కూడా ఒసాకా నగర ప్రజలను కలవరపెడుతున్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం మరణాల్లో దాదాపు 25 శాతం ఆ…
కరోనా కష్టకాలంలో తన వంతుగా కోవిడ్ బాధితులకు సాయం చేసేందుకు సినిమా సెలెబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. కోవిడ్ సంబంధిత అన్ని సహాయాలను అందించేలా ఈ సంస్థ నడుస్తుందని, సాయం అవసరమున్న ప్రతి ఒక్కరు ఈ వెబ్ సైట్ కు రిక్వెస్ట్ లు పెట్టొచ్చని ఆమె పేర్కొంది. అలా వచ్చిన అభ్యర్థనలు పరిశీలించి సాయం చేసేందుకు ఓ టీమ్ పని…