తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి వేవ్ లో ఉన్నంతగా సీరియస్ లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఇటీవలే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పోలీసులు ఫుడ్ డెలివరీ సంస్థలకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ వాహనాలను సైతం సీజ్ చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించారంటూ ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా వడ్డించారు. దీనిపై డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా తమను అపేస్తున్నారంటూ ఈ కామర్స్ డెలివరీ బాయ్స్ అవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కామర్స్ లో ఉన్న సేవలకు కూడా అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.