కరోనా సెకండ్ వేవ్ కారణంగా జమ్మూ కాశ్మీర్ లో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 24తో కరోనా నియంత్రణలు ముగియనుండటంతో మహమ్మారి కట్టడికి కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూను మే 31 వరకూ పొడిగించినట్టు జమ్ము కశ్మీర్ అధికార యంత్రాంగం శనివారం వెల్లడించింది. కర్ఫ్యూ నుంచి నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.