దేశమంతటా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే మహారాష్ట్ర, ముంబైలో మాత్రం మరింత దారుణంగా పరిస్థితి ఉంది. అందుకే, ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్వరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రచారం చేస్తోంది. తాజాగా అభిషేక్ బచ్చన్ నటించిన సినిమాల పేర్లు ఎంచుకుని వాటితో వెరైటీగా ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ మెసేజ్ ని ఇచ్చారు! దానికి అభిషేక్ బచ్చన్ స్పందించటం నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది!
ఇంతకీ, ముంబై పోలీస్ సోషల్ మీడియాలో ఏమన్నారంటే…. ‘గురు’… ముంబై లేదా ‘దిల్లీ 6’ ఫీట్ డిస్టెన్స్ తప్పనిసరి!
తమ ట్వీట్ లో అభిషేక్ నటించిన ‘గురు, దిల్లీ 6’ సినిమాల్ని పోలీసులు ప్రస్తావించగా… ఆయన రిప్లై ఇస్తూ ‘’మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను’’ అన్నాడు. అలాగే, సేమ్ ట్వీట్ లో ‘’ఇంట్లో ఉండండి. ఇంట్లోనే ‘ధూమ్’ ధామ్ గా మజా చేయండి! ‘లూడో’ ఆడండి! సేఫ్ గా ఉండండి… ‘’ అని జనానికి పిలుపునిచ్చాడు. ‘ధూమ్’, ‘లూడో’ కూడా అభిషేక్ సినిమాలే!