దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా గత ఏడాది మంచి ముహూర్తాలు వున్నా.. పెళ్లిళ్లలను చాలా మంది తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ మంచి ముహుర్తాలే ఉండటంతో ఎలాంటి హడావుడి లేకుండా వివాహాలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది అతిథులు లేకున్నా.. మండపాలు లేకున్నా చాలా చోట్ల ఇండ్లల్లో, గుళ్ళల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలో నిబంధనలు ఉండటంతో తక్కువ మంది…
దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్ తో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే వుంది. కాగా ఫ్రంట్ వారియర్స్ గా పోరాడుతున్న డాక్టర్లు కూడా మృత్యువాత పడటం కలిచివేస్తుంది. కరోనా మొదటి వేవ్‌లో 730 మంది డాక్టర్లు మృతి చెందగా, సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు 244 మంది వైద్యులు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే సెకండ్ వేవ్‌లో 69 మంది డాక్టర్ల…
కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా తమిళ నటుడు నితీశ్ వీరా కరోనాకు బలయ్యారు. ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అసురన్’లో పాండ్యన్ పాత్రపోషించి గుర్తింపు తెచ్చుకున్న నితీశ్ చెన్నైలోని ఒమందురార్ హాస్పిటల్ లో ఈ రోజు కన్నుమూశారు. ‘పుదుపేట్టై, వెన్నెల కబాడి కుళు, మావీరన్ కిట్టు’ సినిమాల్లో నూ గుర్తింపు ఉన్న పాత్రలను పోషించారు నితీశ్. ఇక రజనీకాంత్ ‘కాలా’లోనూ కనిపించిన నితీశ్ మరణం తమిళ చిత్రపరిశ్రమలో పెద్ద షాక్…
తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో సీఎం సహాయ నిధికి సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి స్వయంగా అందజేశారు. కాగా తమిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి కరోనా సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు అందజేశారు. వీళ్లతో పాటు…
ప్రస్తుతం మన దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తుంది. రోజుకు దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ సమయంలో కరోనా బాధితులను ఆదుకోవడానికి కొంత మంది కరోనా విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ కరోనా విరాళాల సేకరణ పై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పంచ్ వేశారు. అయితే తాను నిధుల సేకరణ ప్రారంభించకపోవడానికి కారణాలు ఉన్నాయని… ఇతరుల నుండి డబ్బు అడగడం ‘ఇబ్బందికరంగా’ ఉందని అన్నాడు.…
కరోనా వైరస్ ఆదిలో మెజార్టీ కేసులు సిటీలు, పట్టణ ప్రాంతాల్లో వెలుగు చూడగా… సెకండ్‌వేవ్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది… నగరాలు, పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూడడం సవాల్‌గా మారిపోయింది.. అయితే, దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.. దేశంలో గ్రామీణ ప్రాంతాలలో వేగంగా కరోనా విస్తరిస్తోండగా.. వైద్య సదుపాయాల కొరతతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు..…
కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాలు పంచుకుంటున్నారు. అందులో భాగంగానే తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా అ విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, తల అజిత్, తలపతి విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్, తమిళ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీతో పాటు తదితరులు కరోనా రిలీఫ్ ఫండ్ కు…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తమ్ముడు అషిమ్ బెనర్జీ కరోనా కారణంగా మృతి చెందారు. బెంగాల్ లో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే బెంగాల్ లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 136 మంది మృతి చెందారు. బెంగాల్ లో రేపటి నుంచి మే 30వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు…
రాజ్ కపూర్ తనయుడు, ఒకప్పటి బాలీవుడ్ రణధీర్ కపూర్, కరిష్మా, కరీనా కపూర్ తండ్రి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకుంటున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న రణధీర్ కపూర్ డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ 29న రణధీర్ కపూర్ తో పాటు ఆయన సిబ్బంది ఐదుగురికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. రణధీర్ కపూర్‌ను…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఆయన టీకా సెంటర్ కు వెళ్లిన పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మే 14 శుక్రవారం ముంబైలోని ఒక టీకా కేంద్రంలో సల్మాన్ ఖాన్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. అంతకుముందు సల్మాన్ ఖాన్ మార్చి 24న ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ -19 కేసుల సంఖ్యా భారీగా పెరిగిపోతోంది. ఇక సెలబ్రిటీలు కూడా సురక్షితంగా…