ఆనందయ్య మందుపై పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. అటు జంతువులపైనా ప్రయోగాలు చేస్తున్నారు. మంగాపురంలోని యానిమల్ ల్యాబ్ లో ఈ పరిశోధనలు చేస్తున్నారు. నాలుగు దశల్లో ట్రయల్స్ నిర్వహించి, ప్రభుత్వ నివేదిక ఆధారంగా మందును సరఫరా చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి అన్నారు. మందు పంపిణీకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా కొవిడ్ అధికంగా ఉన్న జంతువుపై కంటి మందు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రయోగాలకు కనీసం నెల రోజులు పట్టే…
నటుడు సోనూసూద్ కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తొలి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో సోనూసూద్ మానవతా హృదయానికి అందరూ ఆయన ఫొటోకు పాలాభిషేకం చేశారు. అది కాస్త వైరల్ గా మరి సోనూసూద్ దాకా చేరింది. ఈ నేపథ్యంలో సోను ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. మీ అభిమానానికి…
దేశవ్యాప్తంగా కరోనా కేసుల తగ్గుముఖం పడుతున్న వేళ తమిళనాడులో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమిళనాడులో 34,285 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్కు మరో 468 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో అత్యధిక కేసులు తమిళనాడులోనే నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ స్ట్రెయిన్ తమిళ ప్రజలకు మరింత గుబులు పుట్టిస్తోంది. ఇక దేశంలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు 11.53%కి తగ్గింది. రికవరీ రేటు 88.69%కి పెరిగింది.
కరోనా మహమ్మారిని అంతం చేయడానికి ప్రజలు ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కర్ణాటక బెల్గాం దక్షిణ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ హోమాలు నిర్వహించారు. అగ్ని హోమం పొగతో కరోనా పరార్ అవుతుందంటూ ఎమ్మెల్యే ప్రచారం చేపట్టారు. హోమాల్లో నెయ్యి, కర్పూరం, నిమ్మకాయలు, బియ్యం, లవంగాలను ఉపయోగించారు. దాదాపు 50 చోట్ల హోమాలను జరిపారు. వాతావరణం పరిశుభ్రమౌతుందని పాటిల్ అంటున్నాడు. ఓ బండిలో హోమం కాల్చుతూ ఊరంతా తిప్పారు.…
మహారాష్ట్రలో కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 90 వేలను దాటేసింది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 24,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 601 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో.. 36,176 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,14,368 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 90,349కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా నిర్ధారణ పరీక్షలలో నెగెటివ్ రావడం ఆనందంగా ఉంది. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కిమ్స్ హాస్పిటల్స్ నుండి నా వైద్యులు డిఆర్ ప్రవీణ్ కులకర్ణి, నా కజిన్ డాక్టర్ వీరు, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్ కు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. వారి…
కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. బ్లాక్ ఫంగస్ గురించి ప్రజలకు తెలిసే లోపే.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశ ప్రజలు దిక్కు తోచని పరిస్థితిని ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో…
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా కరోనాతో ప్రముఖ నిర్మాత , దర్శకుడు పి. సోమశేఖర్ మృతి చెందారు. ఈయన ప్రముఖ దర్శకుడు రామ్…
దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో మరోవైపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక జూన్ మొదటి వారం నుంచి దేశమంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దేశంలో జ్వరాలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కాలం మారుతున్న నేపథ్యంలో వాతావరణం కూడా మారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలంలో జ్వరాలు కాస్త తక్కువగా ఉంటాయి. వర్షాలు వచ్చేసరికి సీజనల్ వ్యాధులు కొన్ని వచ్చే…
కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. ఇక హైదరాబాద్ నగరంలోను కోవిడ్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఒక్కో స్మశానంలో రోజుకు 10 కి పైగా మృతదేహాలు వస్తున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. కోవిడ్-నాన్ కోవిడ్ మృతదేహాలను వేర్వేరుగా దహనాలు చేస్తున్నామని చెప్తున్నారు.…