కరోనా సెకండ్ వేవ్ కారణంగా సెలెబ్రిటీలతో సహా ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది కరోనాతో ఆసుపత్రులలో పోరాడుతున్నారు. ఈ కఠిన సమయాల్లోనే ప్రజలకు సహాయం అందించడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్ తన దాతృత్వంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. ఇంకా తన సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు తమకు తోచిన సాయం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ కరోనా బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఆయన తన గెస్ట్ హౌస్ ను కరోనా బాధితుల కోసం కేటాయించినట్టు తెలుస్తోంది. కరోనా లాంటి క్లిష్ట సమయంలో పలువురు ప్రముఖ నటీనటులు ఇలా ముందుకు వచ్చి సాయం అందించడం హర్షణీయం. తమిళనాడులో అయితే పలువురు స్టార్ హీరోలంతా కలిసి ముఖ్యమంత్రి నిధికి భారీ విరాళాలు అందజేశారు.