కరోనా కట్టడిలోనై తన మార్క్ చూపిస్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. మాస్క్ ధరించడంపై స్వయంగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు.. ఇక, కోవిడ్ కట్టడిలో తామున్నామంటూ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు సినీ తారలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు.. తాజాగా, కోవై జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏకుంగా రూ.32 కోట్ల విరాళాలు అందజేశారు. ఈ మేరకు తమిళనాడు సచివాలయం ప్రకటన విడుదల చేసింది.. పరిశ్రమల నగరం కోయంబత్తూర్ జిల్లాలో కరోనా నివారణ పనుల కోసం అక్కడున్న పరిశ్రమల యజమానులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు పోటీపడి విరాళాలు అందజేయడంతో ఒకేరోజు రూ.32 కోట్లు విరాళాలు వచ్చాయని పేర్కొంది. కాగా, తమిళనాడు సీఎంగా స్టాలిన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయనను కలిసిన చాలా మంది ప్రముఖులు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.