కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న భారత్‌ను ఆదుకోవడానికి క్రమంగా కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. ఇక, ఇప్పటికే గూగుల్, అమెజాన్ ఇండియా లాంటి చాలా సంస్థలు భారీ సాయాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగానే అమెరికా కూడా ఇండియాకు ఆర్థిక సాయం అందిస్తోంది. కరోనా పోరులో ఇప్పటి వరకు ఇండియాకు 500 మిలియన్ డాలర్ల సాయం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణి చేయడంపై త్వరలో నిర్ణయం…
కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులను బలి తీసుకుంది. తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత యు.విశ్వేశ్వరరావు కరోనాతో కన్నుమూశారు. ‘విశ్వశాంతి’ పతాకంపై విశ్వేశ్వరరావు నిర్మించిన పలు చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా విశ్వేశ్వరరావు తనదైన బాణీ పలికించారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు దేశవిదేశాలలో ప్రదర్శితమయ్యాయి. ప్రభుత్వ అవార్డులనూ, ప్రేక్షకుల రివార్డులనూ పొందాయి. నేటికీ ఆ నాటి సినీజనం ‘విశ్వశాంతి’ విశ్వేశ్వరరావు అనే ఆయనను గుర్తు చేసుకుంటారు. తన చిత్రాలలో స్టార్స్ ను పక్కకు…
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారినపడి కోలుకున్నారు. దాపు 15 రోజులు తన కుటుంబానికి దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ ఇటీవలే కరోనా నుంచి పూర్తిగా కోలుకుని తన కుటుంబాన్ని చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా తన టీంతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా సొంత ఖర్చులతో వ్యాక్సిన్ వేయించారు. ఆలా దాదాపు 135 మందికి సొంత ఖర్చులతో…
నేడు యంగ్ హీరో మంచు మనోజ్ బర్త్ డే. పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మంచు మనోజ్ 25,000 కుటుంబాలకు సాయం అందించడానికి ముందడుగు వేశారు.”ఈ సంవత్సరం పుట్టిన రోజున కోవిడ్-19 వల్ల ప్రభావితమైన వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతుగా సహాయం చేయాలి అనుకుంటున్నాను. ముందుగా…
దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ తర్వాత కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం 13 శాతం తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్ ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతోందని తెలిపింది. గత వారం ప్రపంచవ్యాప్తంగా 48 లక్షల కేసులు, 86 వేల మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ పేర్కొంది. అంతకుముందు వారంతో పోలిస్తే మరణాలు 5 శాతం,…
గత యేడాది డిసెంబర్ 25న విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుబ్బు. అతని తల్లి మంగమ్మ కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె కొవిడ్ 19తో పోరాటం చేస్తున్నారు. సరైన వైద్యం సకాలంలో అందకపోవడంతో సుబ్బు సోషల్ మీడియా ద్వారా మాట సాయం చేయమంటూ కోరాడు. ఆ విషయం హీరో సాయి తేజ్ దృష్టికి వెళ్లడంతో ఈ సమస్యను తన ట్విట్టర్ లోనూ పోస్ట్ చేశాడు. కానీ…
దేశంలో కరోనా మరణాలు ఎక్కువ అవుతుండటంతో జనాల్లో భయం పెరిగిపోతోంది. ఏ టైమ్ లో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోననే నెగిటివ్ ఆలోచనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనిపై సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ పలు సూచనలు చేశారు. ‘మనం అందరం మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. మనం ఏమీ చేయలేమని అనుకోవద్దు. రోజురోజుకూ భయం కాదు.. బాధ్యత పెరగాలి. అందరూ ఒకరికి…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. ఇక ఈ కరోనా మహమ్మారి భారత క్రికెటర్ల ఇళ్ళల్లోనూ విషాదం నింపుతోంది. ఇప్పటికే టీం ఇండియా మాజీ క్రికెటర్ పియూష్ చావ్లా, ఆర్పీ…
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో.. మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది ఒడిశా ప్రభుత్వం… జూన్ 1వ తేదీ వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది.. మే 5 నుంచి అమలు చేసిన రెండు వారాల లాక్డౌన్ ఈ నెల 19వ తేదీతో ముగియనుండగా.. అయితే, ఆరోగ్య నిపుణులను సంప్రదించిన తర్వాత మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించినట్టు ప్రభుత్వం పేర్కొంది… ఒడిశాలో పాజిటివిటీ రేటు 20 శాతంగా ఉండగా… దాదాపు రెండు వారాల లాక్డౌన్ తర్వాత ఇప్పుడు…