కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. ఇక హైదరాబాద్ నగరంలోను కోవిడ్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఒక్కో స్మశానంలో రోజుకు 10 కి పైగా మృతదేహాలు వస్తున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. కోవిడ్-నాన్ కోవిడ్ మృతదేహాలను వేర్వేరుగా దహనాలు చేస్తున్నామని చెప్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 4000 మంది ఇప్పటివరకు చనిపోయినట్లుగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చెబుతుంది.