సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది.. ‘కుంబళంగి నైట్స్’ సినిమాతో మంచి పేరుపొందిన మలయాళ నటి అంబికారావు (58) గుండెపోటుతో మరణించారు… అంబికారావు సోమవారం రాత్రి కన్నుమూశారు. సమాచారం ప్రకారం, ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 10.30 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. కోవిడ్ -19 బారిన పడిన తర్వాత వచ్చిన సమస్యలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. ఆమె మృతిచెందినట్టు తెలుస్తోంది.. మలయాళ చిత్ర పరిశ్రమలో 2002లో అడుగుపెట్టారు అంబికారావు.. చలనచిత్ర నిర్మాత బాలచంద్ర మీనన్ యొక్క ‘కృష్ణ గోపాలకృష్ణ’ మూవీతో అసిస్టెంట్ దర్శకురాలిగా వృత్తిని ప్రారంభించారు. రెండు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్‌లో, మమ్ముట్టి యొక్క ‘రాజమాణిక్యం’, ‘తొమ్మనుమ్ మక్కలుమ్’ మరియు పృథ్వీరాజ్ యొక్క ‘వెళ్లినక్షత్రం’ వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు.
Read Also: Naga Chaitanya: విడాకులు, ఎఫైర్ రూమర్స్‌పై చైతూ మాట్లాడతాడా?
అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడంతో పాటు, ‘సాల్ట్ అండ్ పెప్పర్’, ‘మీషా మాధవన్’, ‘థమాషా’, ‘వెల్లం’ మొదలైన అనేక మలయాళ సినిమాల్లో నటించారు అంబికారావు.. ఆమెకు ఇద్దరు కుమారులు.. వారి పేర్లు రాహుల్ మరియు సోహన్.. ఆమె మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది మళయాళ చిత్ర పరిశ్రమ.. పృథ్వీరాజ్, కుంచాకో బోబన్, ఇతర మలయాళ ప్రముఖులు ఆమె మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. “శాంతితో విశ్రాంతి తీసుకోండి అంబికా చెచీ” అని పృథ్వీరాజ్ రాసుకొచ్చారు..