కరోనా వైరస్ గతేడాదే అంతమైపోయిందనుకున్నాం. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మన దేశంలో రోజురోజుకీ కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణతోపాటు 10 రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ను కనుగొన్నట్లు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పది రాష్ట్రాల నుంచి సేకరించిన 69 శాంపిల్స్‌లో బీఏ-2.75 అనే వేరియంట్‌ని గుర్తించామని డాక్టర్ షే ఫ్లీషాన్ తెలిపారు. ఇండియా సహా ఏడు ఇతర దేశాల నుంచి 85 సీక్వెన్స్‌లను అప్‌లోడ్ చేశామని చెప్పారు.
Rahul Gandhi: కేటీఆర్ ఇలాకాలో రాహుల్ టూర్.. ప్లానేంటి?
కొత్త వేరియంట్ వెలుగులోకి రావటం రానున్న రోజుల్లో తలెత్తనున్న వైరస్ విపరీత పరిణామాలకు నిదర్శనమని, ఈ వేరియంట్ ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన శాంపిళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర-27, పశ్చిమ బెంగాల్‌లో 13, హర్యానాలో 6, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, కర్ణాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణలో 2, ఢిల్లీ, జమ్మూ, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 69 శాంపిల్స్. ఒకవైపు కరోనా వైరస్‌లో ఇలా కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తుంటే మరోవైపు ప్రజల్లో కొవిడ్ వ్యాప్తి పట్ల సీరియస్‌నెస్ లోపిస్తున్నట్లు కనిపిస్తోంది.
మాస్కులు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. మెట్రో రైళ్లలో, ఆర్టీసీ బస్సుల్లో మాస్కును ‘తప్పనిసరి’ చేయలేదు. మాస్కు లేకుండా బయట తిరిగితే జరిమానా విధిస్తామంటూ ప్రభుత్వం.. ప్రకటనలకే పరిమితమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటానికి ఇది కూడా ఒక కారణమని వైద్యులు అంటున్నారు. తెలంగాణలో సైతం పెద్ద సంఖ్యలో ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 వందల 57 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 2 వందల 85 మంది మహమ్మారి బారిన పడటం గమనార్హం. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల 7 వందల 47కి పెరిగింది.
Sand Mafia: ఇసుక స్మగ్లర్ల బరితెగింపు.. ఫారెస్ట్ అధికారులపై పెట్రోల్ దాడి