రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలని అధికారులకు మంత్రి హరీశ్ రావ్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో DMHOలతో మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని వైద్య సిబ్బందికి పలు సచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్ళీ దేశంలో వేగం పుంజుకుంటోందని ,పోర్త్ వేవ్ కు చేరువలో వున్నామా అన్నట్లు భయాన్ని కలుగజేస్తోంది. ఈనేపథ్యంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదువుతున్నాయి.
Read also: Yadhbhavam Thadhbhavathi: సందీప్ కిషన్ ఆవిష్కరించిన వరుణ్ సందేశ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్!
తెలంగాణ లో కూడా గత 24 గంటల్లో 600 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా DMHOలతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బందిని అలర్ట్ చేసారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు జారీ చేసాఉ. రాష్ట్ర వ్యాప్తంగా బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలని DMHOలకు ఆదేశాలు జారీ చేసారు మంత్రి. ఈనేపథ్యంలో.. బూస్టర్ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి అధికారులు, వైద్య సిబ్బంది.. స్థానిక ఎంపీలు, ఎమ్మేల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.
Rythu Bima: రైతు బీమా ఇవ్వనందుకు ఎల్‌ఐసీకి రూ.50 వేల జరిమానా, వడ్డీ