Corona cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. శుక్రవారం ఉదయం వరకు 21,880 కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 21,411 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇటీవల కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు తాజాగా 67 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్ నుంచి తాజాగా 20,726 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.46 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి పెరిగింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు దేశంలో మరో 4,80,202 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,25,997 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,50,100 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో మొత్తం కేసులు 4,38,68,476కి చేరగా.. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,31,92,379 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 34,93,209 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 201.68 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 3,49,174 మంది వైరస్ బారినపడగా.. మరో 335 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,11,73,227కు చేరింది. ఇప్పటివరకు మహమ్మారి కారణంగా 63,95,685 మంది మరణించారు.
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!